అమెరికాకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానం | UN votes resoundingly to reject Trump's recognition of Jerusalem as capital | Sakshi
Sakshi News home page

జెరూసలేంపై అమెరికాకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానం

Dec 22 2017 5:22 AM | Updated on Apr 4 2019 3:49 PM

UN votes resoundingly to reject Trump's recognition of Jerusalem as capital - Sakshi

వాషింగ్టన్‌: జెరూసలేంను ఇజ్రాయేల్‌ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మెజార్టీ దేశాలు ఆమోదించాయి. భారత్‌తో సహా 128 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. తొమ్మిది దేశాలు అమెరికా నిర్ణయాన్ని సమర్ధించగా.. 35 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. టర్కీ, యెమెన్‌ దేశాల ప్రతినిధులు ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ.. జెరూసలేం వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించాయి. అన్ని దేశాలు ఐరాస భద్రతా మండలి తీర్మానానికి కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశాయి.   

Advertisement
 
Advertisement
Advertisement