ఆస్ట్రేలియాలో ఇద్దరు కేరళ యువతుల మృతి | Two Indian-origin sisters killed in car crash in Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఇద్దరు కేరళ యువతుల మృతి

May 25 2016 12:34 PM | Updated on Aug 14 2018 3:25 PM

ఆస్ట్రేలియాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్ కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు.

మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్ కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కారును నార్తర్న్ ఆస్ట్రియాలోని క్వీన్ లాండ్స్ క్రాసింగ్ వద్ద సోమవారం ఓ ట్రక్ ఢీ కొనడంతో  ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని అంజు మోల్(23), ఆశా మాథ్యూ (18) గా గుర్తించారు.

వీరు ఇంటికి తిరిగిరాక పోవడంలో వీరి కుటుంబ మిత్రుడు రంజిత్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. వీరు ఆస్ట్రేలియాలోని టుంబాకు చెందిన కీట్ కమ్యూనిటీకి చెందినవారు. వీళ్ల స్వస్థలం కేరళ. ఆస్ట్రేలియాలో అంజు నర్సుగా పనిచేస్తోంది. ఆమె సోదరి మాథ్యూ కూడా నర్స్ కోర్సు చేస్తోంది. ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం వీరి మృత దేహాలను స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement