బ్రిటన్‌లో ఇద్దరు భారతీయుల మృతి

two indian descents killed in car accident - Sakshi

లండన్‌: మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు ఢీకొనడంతో భారత సంతతికి చెందిన ఇద్దరు మైనర్లు మృతిచెందిన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సంజయ్‌ (10), పవన్‌వీర్‌ సింగ్‌ (23 నెలలు) మృతిచెందారు. అన్నదమ్ములైన వీరిద్దరూ తల్లితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వోల్వర్‌హామ్టన్‌ వద్ద వారి కారును ఆడీ ఎస్‌3 కారు ఢీకొంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ బెంట్లీ కారు డ్రైవర్‌తో రేసింగ్‌లో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ రేసింగ్‌లో ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారీలో ఉండగా.. బెంట్లీ కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడీ, బెంట్లీ కార్లు మితిమీరిన వేగంతో వెళ్తుండగా చూశామని పలువురు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top