’ట్రంప్‌ వచ్చాడు.. ఇక బ్యాగులు సర్దుకోండి’ | Trump Will 'Do To You Muslims What Hitler Did To The Jews': Threatening Letters | Sakshi
Sakshi News home page

’ట్రంప్‌ వచ్చాడు.. ఇక బ్యాగులు సర్దుకోండి’

Nov 28 2016 9:13 AM | Updated on Aug 28 2018 7:22 PM

’ట్రంప్‌ వచ్చాడు.. ఇక బ్యాగులు సర్దుకోండి’ - Sakshi

’ట్రంప్‌ వచ్చాడు.. ఇక బ్యాగులు సర్దుకోండి’

‘ట్రంప్‌ వచ్చాడు. ఇక మీరు గడియలు లెక్కించుకునే రోజొచ్చింది. యూదుల విషయంలో హిట్లర్‌ ఎలా చేశాడో.. ముస్లింల విషయంలో ట్రంప్‌ కూడా అలాగే చేస్తాడు’ అని అమెరికాలోని ముస్లింలను బెదిరిస్తూ కొన్ని లేఖలు అక్కడి మసీదులకు వెళ్లాయి.

న్యూయార్క్‌: ‘ట్రంప్‌ వచ్చాడు. ఇక మీరు గడియలు లెక్కించుకునే రోజొచ్చింది. యూదుల విషయంలో హిట్లర్‌ ఎలా చేశాడో.. ముస్లింల విషయంలో ట్రంప్‌ కూడా అలాగే చేస్తాడు’ అని అమెరికాలోని ముస్లింలను బెదిరిస్తూ కొన్ని లేఖలు అక్కడి మసీదులకు వెళ్లాయి. అమెరికన్స్ ఫర్‌ ఏ బెటర్‌ వే పేరిట చేతి వ్రాతతో రాసిన ఈ లేఖలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాలిఫోర్నియాలోని శాన్‌ జోస్‌, లాంగ్‌ పనోమాలో గల మసీదులకు పంపించారు. ఈ లేఖల్లో ఉపయోగించిన భాష, ఉపయోగించిన పదాలు బయటకు చెప్పలేనంత దారుణంగా ఉన్నాయి. ముస్లింలపై తీవ్రమైన విద్వేషం పెంచుకున్నవారే స్వయంగా ఈ పనిచేసి ఉంటారని అనిపించేంతగా ఈ లేఖను రాశాను. ముస్లింలను దుష్టులు, సతాను వారసులు అని అందులో పేర్కొన్నారు.

వారు దుష్టశక్తిని పూజిస్తారని.. ఇక వారు గడియలు లెక్కించుకునే రోజు వచ్చిందని, నాడు హిట్లర్ యూదులను ఏం చేశారో ఇప్పుడు ట్రంప్‌ కూడా ముస్లింల విషయంలో అదే చేస్తారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. తమ దేశంలోని ముస్లింలను ట్రంప్ ఊడ్చిపారేస్తారని, తిరిగి అమెరికాను వెలుగొందేలా చేస్తారంటూ ఆ లేఖలో చెప్పారు. ట్రంప్‌ తమ కొత్త రక్షకుడని, ఆయన నిండు జీవితం బతకాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలివైన వాళ్లయితే ఇప్పుడే బ్యాగులు సర్దుకుని పారిపోవాలని కూడా హెచ్చరించారు. ట్రంప్‌ వచ్చిన తర్వాత ముస్లింలకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు సంఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement