అదిరిపోయే ఫొటో.. అసలు మ్యాటరేంటి! | tornado do nothing, says canada man Theunis Wessels | Sakshi
Sakshi News home page

అదిరిపోయే ఫొటో.. అసలు మ్యాటరేంటి!

Jun 6 2017 4:15 PM | Updated on Sep 5 2017 12:57 PM

పనిలో ఉంటే తన భర్త ఎంత పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చినా పట్టించుకోడని కెనడా మహిళ గర్వంగా చెబుతోంది.

ఒట్టావా: పనిలో ఉంటే తన భర్త ఎంత పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చినా పట్టించుకోడని కెనడా మహిళ గర్వంగా చెబుతోంది. థియునిస్ వెస్సెల్స్, సిసిలియా వెస్సెల్స్ అనే దంపతులు స్థానికంగా నివాసం ఉంటున్నారు. గత శుక్రవారం ఓ భయంకరమైన టోర్నడో వారి ఇంటి ఆవరణాన్ని చుట్టుముట్టింది. అదే సమయంలో భర్త థియునిస్ తనకేం సంబంధం లేదన్నట్లుగా ఇంటి ఆవరణలోని గడ్డిని మేషిన్ తో కట్ చేస్తున్నాడు.

థియునిస్ భార్య సిసిలియాకు ఓ ఆలోచన తట్టింది. భర్త వెనకాల టోర్నడోను ఫోన్ కెమెరాతో క్లిక్ మనిపించింది. ఆ ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా విపరీతమైన లైక్స్, షేర్లను సంపాదించుకుంది. టోర్నడో ఉన్న విషయం తనకు తెలుసునని.. తనకు గడ్డి కట్ చేయడమే ముఖ్యమన్నాడట. అందుకే ఉపద్రవంపై ఓ కన్నేసి.. హ్యాపీగా తన పని చేసుకున్నట్లు భర్త తనతో చెప్పాడని సిసిలీయా వివరించింది.  

తాను తల్లికి మాత్రమే ఈ ఫొటోను ట్యాగ్ చేయగా మెల్లిమెల్లిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని ఫొటో స్టోరీని వెల్లడించింది సిసిలీయా. ఫొటోలో మాత్రం ఇంటి పక్కనే ఉన్నట్లుగా కనిపించినా.. టోర్నడో దూరంగా ఏర్పడిందని కొందరు కామెంట్ చేయగా.. ఏది ఏమైతేనేం ఫొటో మాత్రం సూపర్బ్ అంటూ మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement