పెద్దదై.. చిన్నబోయింది! | .. Too dumbstruck! | Sakshi
Sakshi News home page

పెద్దదై.. చిన్నబోయింది!

Dec 2 2014 3:40 AM | Updated on Sep 2 2017 5:28 PM

పెద్దదై.. చిన్నబోయింది!

పెద్దదై.. చిన్నబోయింది!

చుట్టూ పచ్చదనంతో ఐదు ఎకరాల ఆహ్లాదకర స్థలం.. అందులో మూడంతస్తుల భవనం.. 28 బెడ్‌రూములు..

చుట్టూ పచ్చదనంతో ఐదు ఎకరాల ఆహ్లాదకర స్థలం.. అందులో మూడంతస్తుల భవనం.. 28 బెడ్‌రూములు.. 19 రిసెప్షన్ గదులు.. 8 బాత్‌రూమ్‌లు.. ఓ పెద్ద బాల్‌రూం.. వెరసి మొత్తం 34,250 చదరపు అడుగుల్లో నిర్మాణం.. యూకేలోని బైడ్‌ఫోర్డ్ సమీపంలో ఓ హైవే పక్కనే ఉన్న ఈ మోర్టన్ హౌస్ అమ్మకానికి వచ్చింది.

యూకేలో సగటు ఇంటి కంటే 35 రెట్లు ఎక్కువగా, ఓ ఫుట్‌బాల్ మైదానంలో సగానికిపైగా ఉంటే ఈ పురాతన భవనాన్ని కొనుక్కోవాలంటే భారీ మొత్తమే వెచ్చించాలని అనుకుంటున్నారా? సాధారణంగా ఇంటి సైజు పెరిగేకొద్దీ ధర కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ ఇల్లు ఇంత పెద్దగా ఉండటం వల్లే చాలా తక్కువకు అమ్ముడుపోయింది. కేవలం 6 లక్షల పౌండ్లకే (దాదాపు రూ.5.85 కోట్లు) ఓ మిలియనీర్ దీన్ని సొంతం చేసుకున్నాడు.

సెంట్రల్ లండన్‌లో ఓ సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ కావాలంటే కనీసం 12 లక్షల పౌండ్లు చెల్లించాల్సిందే. అలాంటిది.. అందులో సగం ధరకే ఇంత భారీ భవనాన్ని సొంతం చేసుకోవడం చాలా చక్కని డీల్ అని ఈ ఒప్పందాన్ని కుదిర్చిన జేమ్స్ గిబ్స్ పేర్కొన్నారు.

ఈ ఇంటి ధరను 5 లక్షల పౌండ్లుగా నిర్ధారించి అమ్మకానికి పెట్టగా.. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఆఫర్లు వచ్చినట్టు తెలిపారు. అన్నట్టు.. ఈ భవనం చాలా పురాతనమైనది. 1760లో దీని నిర్మాణం ప్రారంభించి 1820లో పూర్తిచేశారు. తర్వాత మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఇందులో ఆధునిక హంగులు కూడా సమకూర్చుకుంటూ వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement