ఈ బ్రష్ ధర రూ.12 వేలు | Sakshi
Sakshi News home page

ఈ బ్రష్ ధర రూ.12 వేలు

Published Sun, Jul 10 2016 4:14 AM

ఈ బ్రష్ ధర రూ.12 వేలు

పళ్లు తోముకోవడానికి మీరు ఎంతసేపు సమయం కేటాయిస్తారు? ఓ పదో పదిహేను నిమిషాలో అద్దం ముందు బ్రష్‌తో గడుపుతారు. ఇక నుంచి దానికి అంత సమయం కేటాయించవలసిన అవసరం లేదు. కేవలం 10 సెకన్లలో బ్రషింగ్‌ని పూర్తి చేసే సరికొత్త ఎలక్ట్రానిక్ బ్రష్ ని అమెరికాకు చెందిన కంపెనీ తయారు చేసింది. 10 సెకండ్లలో బ్రష్ చేసుకోవడమా? అని ఆశ్చర్య పడకండి. ఈ బ్రష్ గురించి వింటే ఔరా! అనక మానరు. ఈ బ్రష్‌లో అతి చిన్న కెమెరాలు అమర్చారు.

బ్రష్ నోటిలోకి వెళ్లగానే మన పంటి లోపల భాగాలను ఈ కెమెరా ఫొటోలు తీస్తుంది. దానికి సంబంధించిన చిత్రాలను మన దగ్గరుండే స్మార్ట్‌ఫోన్‌కు పంపిస్తుంది. దీనికి మన దగ్గరున్న స్మార్ట్‌ఫోన్‌ను కెమెరాకు అనుసంధానిస్తే సరిపోతుంది. ఈ బ్రష్‌ను ప్రస్తుతం ట్రయల్ రన్‌లో ఉంచారు. ఇంతకీ ఈ బ్రష్ పేరు చెప్పలేదు కదూ.. దీని పేరు ‘గ్లేర్ స్మైల్ ’. దీని ధర రూ.12వేలు కాగా భారత్‌లో దీన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement