ఈ సోలార్‌ సెల్స్‌ను ఉతికేయొచ్చు.. | These solar cells can be washed | Sakshi
Sakshi News home page

ఈ సోలార్‌ సెల్స్‌ను ఉతికేయొచ్చు..

Sep 20 2017 1:09 AM | Updated on Oct 22 2018 8:25 PM

ఈ సోలార్‌ సెల్స్‌ను ఉతికేయొచ్చు.. - Sakshi

ఈ సోలార్‌ సెల్స్‌ను ఉతికేయొచ్చు..

సూర్యుడు వెలుగుతుంటే చాలు.. నీళ్లల్లో నానబెట్టినా.. రబ్బరులా సాగదీసినా..

సూర్యుడు వెలుగుతుంటే చాలు.. నీళ్లల్లో నానబెట్టినా.. రబ్బరులా సాగదీసినా.. కాగితంలా నలిపేసినా.. నిత్యం విద్యుత్‌ ఉత్పత్తి చేయగల సరికొత్త సోలార్‌ సెల్‌ ఇది. టోక్యోలోని రైకిన్, టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. కాగితం కంటే పలుచగా ఉండే ఈ సోలార్‌ సెల్స్‌ ద్వారా చిన్న చిన్న ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను అక్కడికక్కడే చార్జ్‌ చేసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఒక్కో చదరపు సెంటీమీటర్‌కు దాదాపు 7.86 మిల్లీవాట్ల కరెంటును ఉత్పత్తి చేయగలదు. రెండు గంటల పాటు నీళ్లలో ఉంచినా దీని సామర్థ్యం నామమాత్రంగానే తగ్గుతుంది. పీఎన్‌టీజెడ్‌4ఓ అనే పదార్థంతో దీన్ని తయారు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement