అధ్యక్ష భవనం ఆక్రమణ | terrorists occupied the president's house | Sakshi
Sakshi News home page

అధ్యక్ష భవనం ఆక్రమణ

Apr 3 2015 1:08 AM | Updated on Sep 2 2017 11:45 PM

అధ్యక్ష భవనం ఆక్రమణ

అధ్యక్ష భవనం ఆక్రమణ

సౌదీ అరేబియా నేతృత్వంలో సంకీర్ణ సేనలు ఎంతగా ప్రతిఘటిస్తున్నా యెమెన్‌లో మిలిటెంట్లు చివరికి అధ్యక్ష భవనాన్ని సైతం ఆక్రమించారు.

ఆడెన్: సౌదీ అరేబియా నేతృత్వంలో సంకీర్ణ సేనలు ఎంతగా ప్రతిఘటిస్తున్నా యెమెన్‌లో మిలిటెంట్లు చివరికి అధ్యక్ష భవనాన్ని సైతం ఆక్రమించారు. గురువారం పలువురు హుతీ మిలిటెంట్లు పెద్దఎత్తున ఆయుధాలతో ఆడెన్‌లోని అధ్యక్ష భవనమైన అల్-మషీక్‌ను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా భవనం ప్రాంగణంలో బలగాలకు, తీవ్రవాదులకు భీకరపోరు సాగింది. 44 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఆడెన్‌లో ఎక్కడ చూసినా భీతావహవాతావరణం కనిపిస్తోందని, చాలాచోట్ల శవాలు పడి ఉన్నాయని స్థానికుడొకరు తెలిపారు. అధ్యక్షుడు అబెడ్రబ్బో మన్సూర్ హదీస్‌కు కాస్తోకూస్తో బలమున్న ఆడెన్‌లోనే. ఇప్పుడు ఇది కూడా మిలిటెంట్లపరం కావడం గమనార్హం. మరోవైపు యెమెన్‌లోని హద్రామవ్త్‌లో ఓ జైలును బద్దలు కొట్టి అల్‌కాయిదా ఉగ్రవాదులు 300 మందికి పైగా తమ అనుచరులను విడిపించుకుపోయారు.


 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement