పోలా.. అదిరిపోలా..! | tennis court design in poland | Sakshi
Sakshi News home page

పోలా.. అదిరిపోలా..!

May 2 2015 2:57 AM | Updated on Sep 3 2017 1:14 AM

పోలా..  అదిరిపోలా..!

పోలా.. అదిరిపోలా..!

ఇలాంటి టెన్నిస్ కోర్టు మీరెక్కడైనా చూశారా?

హైదరాబాద్: ఇలాంటి టెన్నిస్ కోర్టు మీరెక్కడైనా చూశారా? సముద్ర గర్భంలో పైన చేపలు తిరుగుతుంటే.. కిందన క్రీడాకారులు టెన్నిస్ ఆడుతుంటే.. చూడ్డానికి బాగుంటుంది కదూ.. ఇదే ఆలోచన  పోలండ్‌కు చెందిన డిజైనర్ కొటాలాకు వచ్చినట్లుంది. దీంతో దుబాయ్ సముద్రగర్భంలో నిర్మించేందుకు వీలుగా ఈ టెన్నిస్ కోర్టు డిజైన్‌ను రూపొందించాడు. తన కలను సాకారం చేసుకునేందుకు పెట్టుబడి పెట్టేవారి కోసం ఎదురుచూస్తున్నాడు. చూడ్డానికి బాగానే ఉంది కానీ.. దీనికి చాలా ఖర్చవుతుందని, భారీ చేపలు వంటివి తిరగడం వల్ల క్రీడాకారుల ఏకాగ్రత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement