
జంతువుల మధ్యే జలకాలాటలు
జంతువుల మధ్య జలకాలాడాలనుందా? కాఫీ తాగుతూ ఏనుగులతో కబుర్లాడాలనుందా?
జంతువుల మధ్య జలకాలాడాలనుందా? కాఫీ తాగుతూ ఏనుగులతో కబుర్లాడాలనుందా? అయితే టాంజానియాలోని స్వాలా అభయారణ్యానికి వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడే ఇలాంటి ప్రత్యేకతలున్నాయి మరి. ఈ అభయారణ్యంలో ఇలా స్విమ్మింగ్‌పూల్‌లో సేద తీరుతూ.. ఆ పక్కనే ఉన్న హోటల్‌లో ఇష్టమైన ఆహారాన్ని తింటూ అటుగా వచ్చిపోయే జంతువులను చూడొచ్చు. అన్నట్టు.. అవి మన దగ్గరకు వచ్చేస్తాయన్న భయం అక్కర్లేదండోయ్. ఎందుకంటే స్విమ్మింగ్‌పూల్‌తోపాటు మనం ఉండే చోటు చుట్టూ పెద్ద కందకం ఉంటుంది. దానిని దాటుకుని అవి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా జంతువుల మధ్య హ్యాపీగా గడపొచ్చన్నమాట. బావుంది కదూ..!