ఇలా కనిపిస్తే రేప్‌ చేస్తాం | Swedish model gets rape threats | Sakshi
Sakshi News home page

ఇలా కనిపిస్తే రేప్‌ చేస్తాం

Oct 7 2017 2:09 PM | Updated on Aug 28 2018 7:24 PM

Swedish model gets rape threats - Sakshi

ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న మోడల్‌ పేరు ఆర్విదా బైస్ట్రోమ్‌.. వయసు 26 సంవత్సరాలు. స్వీడన్‌ దేశానికి చెందిన ఈ మోడల్‌ తాజా ఆడిడాస్‌ షూస్‌కు మోడలింగ్‌ చేసింది. అందులో విశేషం లేకపోయినా.. ఆ యాడ్‌ చూసిన కుర్రాళ్లంతా ఇలా మళ్లీ కనిపిస్తే రేప్‌ చేస్తామంటూ.. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వార్నింగ్‌లు ఇచ్చేస్తున్నారు. మరికొందరైతే దారుణమైన కామెంట్లు పోస్ట్‌​ చేస్తున్నారని ఆర్విదా వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్‌ చేసిన ఫోటోకు ఏకంగా 21 వేల లైకులు, కామెంట్లు వచ్చాయి.

ఇంతకూ విషయం ఏమిటంటే.. ఆర్విదా ఆడిడాస్‌ షూస్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ నటించిన ఆమె.. అందులో కాళ్లకు హెయిర్స్‌ ఉన్నాయి.. ఇవి చూడ్డానికి చాలా అసహ్యకరంగా ఉన్నాయంటూ పలువురు ట్వీట్‌ చేశారు. మరికొందరైతే ఇటువంటి హెయిర్స్‌ ఉన్న అమ్మాయిని రేప్‌ చేయాలనిపిస్తుంది.. అని కామెంట్లు పోస్ట్‌ చేశారు. సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోకు వచ్చిన కామెంట్లు, లైకులను ఆర్విదా గర్వంగా పోస్ట్‌ చేసింది. తన వీడియోను యూట్యూబ్‌లో 5 లక్షల మంది చూశారని ప్రకటించింది. నా ఫొటోను అసహ్యించుకుంటున్నా.. నా అందానికి యువత ఫిదా అయిందని ఈ అమ్మడు గర్వంగా చెబుతోంది. రేప్‌ చేస్తాననే కామెంట్లను ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement