నవాజ్‌ షరీఫ్‌కు మరో ఎదురుదెబ్బ

Supreme Court Bans Nawaz Sharif  As Party Cheif - Sakshi

పార్టీ చీఫ్‌గానూ కొనసాగలేరన్న పాక్‌ సుప్రీంకోర్టు

ఇస్లామాబాద్‌ : పనామా పేపర్ల కేసుతో ప్రధాని పీఠానికి దూరమైన పాక్‌ మాజీ పీఎం నవాజ్‌ షరీఫ్‌ రాజకీయ జీవితానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ –నవాజ్‌ (పీఎంఎల్‌ఎన్‌) చీఫ్‌గా కొనసాగేందుకు నవాజ్‌ అనర్హుడని స్పష్టం చేస్తూ.. ఈయన తీసుకున్న నిర్ణయాలన్నింటినీ పక్కనబెట్టాలని ఆదేశించింది. ‘ఓ పార్టీ చీఫ్‌గా ఉండే వ్యక్తి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 62, 63లను తప్పనిసరిగా అనుసరించాలి.

పార్లమెంటేరియన్లు పార్లమెంటు గౌరవం పెంచేలా బాధ్యతగా వ్యవహరించాలి’అని పాక్‌ సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ సాకిబ్‌ నిసార్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ప్రధాని పదవికి దూర మైన తర్వాత నవాజ్‌.. పార్టీ చైర్మన్‌ పదవిలో ఉండేలా రాజ్యాంగంలో పలు మార్పులుచేశారు. దీంతో షరీఫ్‌ పార్టీ చీఫ్‌గా కొనసాగేందు కు మార్గం సుగమమైంది. దీనిపై పాకిస్తాన్‌ తెహ్రీకీ ఇన్సాఫ్, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ సహా పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top