మంచుతో 6 వేల విమాన సర్వీసులు రద్దు | Snow strom threaten in US | Sakshi
Sakshi News home page

మంచుతో 6 వేల విమాన సర్వీసులు రద్దు

Jan 23 2016 11:33 AM | Updated on Oct 2 2018 7:37 PM

మంచుతో 6 వేల విమాన సర్వీసులు రద్దు - Sakshi

మంచుతో 6 వేల విమాన సర్వీసులు రద్దు

అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది.

అమెరికా: అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అమెరికా ఈశాన్య ప్రాంతంలో ఎడతెగకుండా కుండపోతగా మంచు కురుస్తోంది. ప్రధాన నగరాల్లో రోడ్లపైన రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. మంచు తుపాను కారణంగా 8.5 కోట్లమందిపై తీవ్ర ప్రభావం పడుతోంది. 20 రాష్ట్రాలు అతలాకుతలమైయ్యాయి. దాంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వాహనాలు బయటకు తీస్తే ఎక్కడ మంచులో ఇరుక్కుపోతామోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు పేరుకుపోయిన మంచును తొలగించే పనిలో నిమగ్నమైయ్యారు. అమెరికాలోని ఆర్కాన్సాస్‌, కరోలినా, న్యూయార్క్‌, వాషింగ్టన్‌ నగరాల్లో విపరీతంగా మంచు పడుతోంది. మంచు ప్రభావంతో కోటిమందికి పైగా ప్రజలకు ఇళ్లల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. మంచు తుపాను కారణంగా 6 వేలకు పైగా విమాన సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement