మెదడుకు షాకిస్తే.. వేగంగా నేర్చుకోవచ్చట! | Shah .. the brain to learn fast! | Sakshi
Sakshi News home page

మెదడుకు షాకిస్తే.. వేగంగా నేర్చుకోవచ్చట!

Mar 25 2014 3:47 AM | Updated on Apr 4 2019 3:25 PM

మెదడుకు షాకిస్తే..  వేగంగా నేర్చుకోవచ్చట! - Sakshi

మెదడుకు షాకిస్తే.. వేగంగా నేర్చుకోవచ్చట!

మెదడుకు స్వల్ప విద్యుత్‌తో షాక్ ఇస్తే.. విషయాలను నే ర్చుకోవడంలో వేగం కూడా పెరుగుతుందట. షాక్ ఇచ్చే దిశను బట్టి.. నేర్చుకునే వేగాన్ని పెంచడమే కాదు..

 వాషింగ్టన్: మెదడుకు స్వల్ప విద్యుత్‌తో షాక్ ఇస్తే.. విషయాలను నే ర్చుకోవడంలో వేగం కూడా పెరుగుతుందట. షాక్ ఇచ్చే దిశను బట్టి.. నేర్చుకునే వేగాన్ని పెంచడమే కాదు.. తగ్గించొచ్చని కూడా అంటున్నారు అమెరికాలోని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సాధారణంగా మనం ఏదైనా తప్పు చేస్తే గనక.. మెదడు ముందుభాగం మధ్యలో ఉండే వల్కలం (కార్టెక్స్) కొన్ని మిల్లీ సెకన్లలోనే నెగెటివ్ వోల్టేజీని పుట్టిస్తుందని ఇదివరకే వెల్లడైంది.


కానీ.. అది ఎందుకో శాస్త్రవేత్తలకు మాత్రం అర్థం కాలేదు. అయితే తప్పుల నుంచి నేర్చుకునే ప్రక్రియలో భాగంగానే మెదడులో ఈ ఏర్పాటు ఉందని, దానిని కృత్రిమంగా నియంత్రించడం వల్ల కూడా ఫలితాలు సాధించవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. భవిష్యత్తులో ఓ పద్ధతి ప్రకారం మెదడుకు షాక్ ఇస్తూ.. నేర్చుకునే వేగం పెంచే వినూత్న టోపీలు అందుబాటులోకి వస్తాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇది పరిశోధనే కాబట్టి.. మీరు మాత్రం ఇలాంటి ప్రయోగం చేయకండి సుమా..!
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement