మయన్మార్‌ చరిత్రలో చీకటిరోజు

Sad Day For Myanmar Says Seven Daily - Sakshi

నోపిడా : మయన్మార్‌ చరిత్రలో ఈ రోజును చీకటి రోజుగా ఆ దేశ పత్రిక సెవెన్‌ డైలీ (7డైలీ) వర్ణించింది. దేశంలో వాక్‌ స్వాతంత్య్ర లేదని, మీడియాపై ప్రభుత్వం కుట్రపూరీతంగా వ్యవహరిస్తోందని దేశంలో అతిపెద్ద ప్రచురణగల సెవెన్‌ డైలీ మొదటి పేజీలో ప్రచురించింది. అంతేకాకుండా మొదటి పేజీలో కొంత భాగాన్ని పూర్తిగా నల్లరంగుతో ప్రచురించి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. మయన్మార్‌లో ఇటీవల జరిగిన రోహింగ్యాల ఊచకోతపై ఇద్దరు జర్నలిస్టులు ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా కథనాలు రాశారన్న ఆరోపణలతో.. ప్రభుత్వం వారిపై అక్రమ కేసులను పెట్టింది. ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు ఇద్దరు జర్నలిస్టులకు ఏడేళ్లు శిక్షను విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది.

కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన పత్రికలు ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రజాప్రభుత్వం పేరుతో 2015లో బాధ్యతలు స్వీకరించిన అంగ్‌సాన్‌ సూకీ కూడా గతంలో దుర్మర్గాలకు పాల్పడిన సైన్యం అడుగుజాడల్లోనే నడుస్తున్నారని సెవెన్‌ డైలీ వ్యాఖ్యానించింది. పత్రికలపై సెన్సార్‌షిప్‌ విధిస్తూ 2012 సైన్యం చట్టం చేసిందని.. ఆ చట్టం పేరుతో సూకీ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారని తీవ్రంగా మండిపడింది. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top