శబరిమల అయ్యప్పకు రూ. 141 కోట్ల ఆదాయం | Sabarimala ayyappa Rs. 141 crore | Sakshi
Sakshi News home page

శబరిమల అయ్యప్పకు రూ. 141 కోట్ల ఆదాయం

Dec 28 2014 3:28 AM | Updated on Sep 2 2017 6:50 PM

శబరిమల అయ్యప్పకు రూ. 141 కోట్ల ఆదాయం

శబరిమల అయ్యప్పకు రూ. 141 కోట్ల ఆదాయం

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయ ఆదాయం ఈ ఏడాది మరింత పెరిగింది.

  • గత ఏడాది కంటే రూ.14 కోట్లు ఎక్కువ
  •  శబరిమల: శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయ ఆదాయం ఈ ఏడాది మరింత పెరిగింది. ఈ ప్రముఖ క్షేత్రానికి యాత్రికుల తాకిడి పెరగటంతో రూ.141.64 కోట్ల ఆదాయం చేకూరింది. ఇది గత ఏడాది కంటే రూ.14 కోట్లు ఎక్కువ. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి దీక్షా పరుల సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని ఆలయ వర్గాలు తెలిపాయి. రూ.141.64 కోట్లలో హుండీ ద్వారా రూ.51.17 కోట్లు లభించాయని, ఇది కూడా గత ఏడాది కంటే దాదాపు రూ.4 కోట్లు ఎక్కువేనని పేర్కొంది.
     

Advertisement
 
Advertisement
Advertisement