ఖరీదైన స్పోర్ట్స్ కారును అలా వాడేశారు! | Russian beachgoers to repurpose their luxurious vehicle as a diving board | Sakshi
Sakshi News home page

ఖరీదైన స్పోర్ట్స్ కారును అలా వాడేశారు!

Jul 20 2016 11:54 AM | Updated on Sep 4 2017 5:29 AM

ఖరీదైన స్పోర్ట్స్ కారును అలా వాడేశారు!

ఖరీదైన స్పోర్ట్స్ కారును అలా వాడేశారు!

మన వద్ద పల్లెల్లో యువకులు, మధ్యవయస్కులలో చాలా మంది బావి పైన ఉండే బండరాయి లాంటి దానిపై నిల్చుని తమదైన స్టైలులో నీళ్లలోకి దూకేవారు కదా!

మన వద్ద పల్లెల్లో యువకులు, మధ్యవయస్కులలో చాలా మంది బావి పైన ఉండే బండరాయి లాంటి దానిపై నిల్చుని తమదైన స్టైలులో నీళ్లలోకి దూకేవారు కదా! అంతేనా నీళ్లలో దాగుడు మూతలు, ఇలా చాలా రకాల ఆటలు ఆడేవారు. ప్రస్తుతం రష్యాకు చెందిన యువకులు ఇలాంటి చేష్టలు చేశారు. అయితే ఇందుకు తమ ఖరీదైన స్పోర్ట్ కారును వినియోగించారు. రష్యాలోని వోల్గోగ్రాడ్ వోల్గా నది బీచ్ వద్ద యువత చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.కొంత మంది బ్యాచిలర్ యువకులు ఓ ఖరీదైన స్పోర్ట్ కారులో బీచ్ వద్దకు వచ్చారు. తొలుత కొందరు నీళ్లలో దిగి కాలక్షేపం చేస్తున్నారు.
 
అందులోని ఓ వ్యక్తికి ఓ సరదా ఆలోచన వచ్చింది. యువకుడు మొదట గాల్లోకి ఎగిరి కారుపై నుంచి జారుతూ నీళ్లలోకి మునకేశాడు. స్పోర్ట్ కారును డైవింగ్ సాధనంగా చేసుకుని సరదా తీర్చుకున్నాడు. ఇక అది మొదలు అతడి స్నేహితులు, మరికొంత మంది అదే పనిగా కారుపైకి డైవింగ్ చేయడం, కారుపై నుంచి నీళ్లలోకి జారడం చేస్తూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత నేరుగా కారు టాప్ పైకి ఎక్కి నీళ్లలోకి దూకుతూ బీచ్ లో స్నానాలు చేస్తూ వీకెండ్ ఎంజాయ్ చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement