300 మంది జీహాదిస్టుల హతం | Russian air force hits 60 Islamic State targets in Syria, kills 300 jihadists | Sakshi
Sakshi News home page

300 మంది జీహాదిస్టుల హతం

Oct 9 2015 10:44 PM | Updated on Sep 3 2017 10:41 AM

సిరియాలో ఐఎస్ఐఎస్ సహా ఇతర ఉగ్రవాద గ్రూపులపై రష్యా వైమానిక దళం జరిపిన దాడుల్లో 300 మందికిపైగా జీహాదిస్టులు మరణించారని రష్యా రక్షణ శాఖ తెలిపింది.

మాస్కో: సిరియాలో ఐఎస్ఐఎస్ సహా ఇతర ఉగ్రవాద గ్రూపులపై రష్యా వైమానిక దళం జరిపిన దాడుల్లో 300 మందికిపైగా జీహాదిస్టులు మరణించారని రష్యా రక్షణ శాఖ తెలిపింది. సిరియాలోని రఖ్ఖా, అలెప్పో తదితర ప్రాంతాల్లో లివా అల్ హక్, ఐఎస్ఐఎస్ ల స్థావరాలను గుర్తించి వాటిపై బాంబుల వర్షం కురిపించినట్లు శుక్రవారం ఒక ప్రకటనను విడుదలచేసింది.

 

ఇందుకోసం కెఏబి-500 బాంబులను కురిపించే ఎస్ యు- 34, ఎస్ యు- 24 జెట్ ఫైటర్లను వినియోగించినట్లు తెలిసింది. సిరియా అధ్యక్షుడు అల్ అసద్ కు అనుకూలంగా తిరుగుబాటు దళాలు, ఐఎస్ ఉగ్రవాదులపై పదిరోజుల కిందట దాడులు ప్రారంభించిన రష్యా.. రోజుకు పది ప్రత్యేక లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తున్నది.

Advertisement
 
Advertisement
Advertisement