breaking news
Russian air force
-
మాస్కోపై డ్రోన్ల దాడి యత్నం భగ్నం.. ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామన్న రష్యా
మాస్కో: రష్యా రాజధాని మాస్కోపై దాడి చేసేందుకు ఉక్రెయిన్ సైన్యం డ్రోన్లను ప్రయోగించిందా? నిజమేనని చెబుతోంది రష్యా వైమానిక దళం. ఉక్రెయిన్ ప్రయత్నాన్ని భగ్నం చేశామని వెల్లడించింది. ఉక్రెయిన్ సైన్యం మంగళవారం ఐదు డ్రోన్లు ప్రయోగించిందని, వెంటనే ఈ విషయం గుర్తించి మాస్కోలో ఒక విమానాశ్రయాన్ని మూసివేశామని రష్యా ఆర్మీ తెలియజేసింది. మరికొన్ని విమానాలను దారి మళ్లించామని పేర్కొంది. మాస్కోలో గతంలోనూ పలుమార్లు డ్రోన్ దాడులు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. రష్యా కిరాయి సైన్యమైన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ తిరుగుబాటు యత్నం విఫలమైన తర్వాత డ్రోన్‌తో దాడి చేసేందుకు ఉక్రెయిన్ ప్రయతి్నంచడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ సైన్యం ఐదు డ్రోన్లను ప్రయోగించగా, వాటిలో నాలుగింటిని కూల్చివేశామని, మరో డ్రోన్‌ను సురక్షితంగా కిందికి దింపామని రష్యా రక్షణ శాఖ తెలియజేసింది. ఈ దాడులతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని మాస్కో మేయర్ సెర్గీ సొబ్యానిన్ చెప్పారు. అయితే, ఈ వ్యవహారంపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. -
300 మంది జీహాదిస్టుల హతం
మాస్కో: సిరియాలో ఐఎస్ఐఎస్ సహా ఇతర ఉగ్రవాద గ్రూపులపై రష్యా వైమానిక దళం జరిపిన దాడుల్లో 300 మందికిపైగా జీహాదిస్టులు మరణించారని రష్యా రక్షణ శాఖ తెలిపింది. సిరియాలోని రఖ్ఖా, అలెప్పో తదితర ప్రాంతాల్లో లివా అల్ హక్, ఐఎస్ఐఎస్ ల స్థావరాలను గుర్తించి వాటిపై బాంబుల వర్షం కురిపించినట్లు శుక్రవారం ఒక ప్రకటనను విడుదలచేసింది. ఇందుకోసం కెఏబి-500 బాంబులను కురిపించే ఎస్ యు- 34, ఎస్ యు- 24 జెట్ ఫైటర్లను వినియోగించినట్లు తెలిసింది. సిరియా అధ్యక్షుడు అల్ అసద్ కు అనుకూలంగా తిరుగుబాటు దళాలు, ఐఎస్ ఉగ్రవాదులపై పదిరోజుల కిందట దాడులు ప్రారంభించిన రష్యా.. రోజుకు పది ప్రత్యేక లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తున్నది.