‘అమెరికా ఐసిస్‌కు సాయం చేస్తోంది’

Russia Posts Image Taken From Videogame As 'Proof' That US Helps ISIS - Sakshi

మాస్కో : మధ్య ఆసియాలో వేళ్లూనుకున్న ఐసిస్‌ భూతానికి అమెరికా సాయం చేస్తోందని, అందుకు ఈ ఫొటోలే ఆధారమని మంగళవారం రష్యా ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యా రక్షణ శాఖ విడుదల చేసిన ఫొటోలపై సోషల్‌మీడియా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే, దీనిపై స్పందించిన రష్యా రక్షణ శాఖ ఫొటోలను గత నెల 9వ తేదీన సిరియా - ఇరాక్‌ సరిహద్దులో తీసినట్లు చెప్పింది. 

ఏసీ -30 గన్‌షిప్‌ సిమ్యులేటర్‌ : స్పెషల్‌ ఆపరేషన్‌ స్క్వాడ్రన్‌ అనే వీడియో గేమ్‌లోని సీన్‌ను ఫొటోలు తీసి విడుదల చేశారని సోషల్‌ మీడియాలో పలువురు పేర్కొన్నారు. కాగా, రష్యా రక్షణ శాఖ విడుదల చేసిన ఫొటోలను పరిశీలించిన ఓ అంతర్జాతీయ న్యూస్‌ ఏజెన్సీ అవి నకిలీవని వెల్లడించింది. దీంతో వెంటనే ఆ ఫొటోలను అధికారిక ట్విటర్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్ల నుంచి తొలగించిన రష్యా రక్షణ శాఖ.. మరో సెట్‌ ఫొటోలను విడుదల చేసింది. అమెరికాకు ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయనడానికి ఈ ఫొటోలే నిదర్శనమని పేర్కొంది.

అబద్దాలు వద్దు..
రష్యా రక్షణ శాఖ వరుస ట్వీట్లపై స్పందించిన రష్యాలోని అమెరికన్‌ ఎంబసీ అబద్దాలను నిజం చేయాలని భావించినంత మాత్రాన అవి మారవని పేర్కొంది. శత్రువును ఉమ్మడిగా ఎదుర్కొని నాశనం చేయాలే తప్ప.. ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top