రష్యా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 37 మంది మృతి | Russia hospital fire kills 37 in Novgorod region | Sakshi
Sakshi News home page

రష్యా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 37 మంది మృతి

Sep 14 2013 4:10 AM | Updated on Sep 5 2018 9:45 PM

వాయవ్య రష్యాలో మానసిక రోగుల ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. లూకా గ్రామంలోని ఓక్సోచీ సైకియాట్రిక్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

లూకా: వాయవ్య రష్యాలో మానసిక రోగుల ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది.   లూకా గ్రామంలోని ఓక్సోచీ సైకియాట్రిక్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున  భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 37 మంది మానసిక రోగులు మరణించారు.  రోగులను కాపాడేందుకు ప్రయత్నించిన ఓ నర్సు కూడా  ఆహుతి అయింది. ఆసుపత్రిలో ఓ రోగి మంచం వద్ద తొలుత ప్రారంభమైన మంటలు తర్వాత అంతటా వ్యాపించాయి. ఆ రోగి పొగ తాగడం వల్ల లేదా ఉద్దేశపూర్వకంగా మంచానికి నిప్పు పెట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మంచానికి నిప్పుపెట్టినట్లు భావిస్తున్న రోగి ‘పైరోమానియా (వస్తువులను కాల్చాలనే కోరికలు కలగడం)’ మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు స్థానికులు ‘ఏఎఫ్‌పీ’తో తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement