డ్రామా ఆడిన వ్యక్తికే ఊహించని షాక్! | road accident compensation scam in Kiev city | Sakshi
Sakshi News home page

డ్రామా ఆడిన వ్యక్తికే ఊహించని షాక్!

Nov 5 2016 4:20 PM | Updated on Apr 3 2019 4:38 PM

డ్రామా ఆడిన వ్యక్తికే ఊహించని షాక్! - Sakshi

డ్రామా ఆడిన వ్యక్తికే ఊహించని షాక్!

డబ్బుల కోసం ఒక్కోవ్యక్తి ఒక్కో తరహాలో ఆలోచిస్తాడు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం అడ్డదారులను ఆశ్రయిస్తుంటారు.

డబ్బుల కోసం ఒక్కోవ్యక్తి ఒక్కో తరహాలో ఆలోచిస్తాడు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం అడ్డదారులను ఆశ్రయిస్తుంటారు. ప్రమాదం అని తెలిసి, అందులో వేరే వ్యక్తి తన వల్ల హత్యాయత్నం చేసులో ఇరుక్కున్నా పరవాలేదు అని భావించి ఓ వ్యక్తి చిన్న ట్రిక్ ప్లే చేసినా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో రోడ్డుపై ఎన్నో వాహనాలు వెళ్తున్నాయి. కోరోట్కోవ్ వ్యక్తి కారులో వెళ్తుంటే ఉద్దేశపూర్వకంగా గుర్తుతెలియని వ్యక్తి కారు కింద పడ్డట్లుగా నటించాడు. అయితే అతగాడి ప్రయత్నం కాస్త బెడిసికొట్టి ముక్కు, నోరు నుంచి కాస్త రక్తం వచ్చింది.

కారు నడుపుతున్న కోరోట్కోవ్ కిందకి దిగగానే తనకు రక్తం కారుతుందని, అందుకు నీ నిర్లక్షపూరిత డ్రైవింగ్ కారణమని ఆరోపించాడు. తనకు డబ్బులు ఇస్తేనే అక్కడి నుంచి కదలాలని కోరోట్కోవ్ ను డిమాండ్ చేశాడు. కోరోట్కోవ్ ఏ మాత్రం భయపడకుండా.. 'నువ్వు ఉద్దేశపూర్వకంగానే నా కారు కింద పడాలని ట్రై చేశావు. డబ్బులు డిమాండ్ చేయడమే నీ టార్గెట్. కారులో ఉన్న డాష్ బోర్డ్ కెమెరా చూడు. ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది' అన్నాడు. పోలీసులకు ఫోన్ చేసి కోరోట్కోవ్ ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో కంగారుపడ్డ గుర్తుతెలియని వ్యక్తి నోరెత్తకుండా అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. మనీ రాకపోగా, గాయాలతో పరారు కావాల్సి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement