breaking news
Dashcam video
-
కదులుతున్న కారులో గ్యాంగ్‌రేప్: డ్యాష్ క్యామ్‌తో సీఈవో గుట్టు రట్టు
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉదయపూర్ సామూహిక అత్యాచార ఉదంతం కలకలం రేపింది. ఈ దురాగతానికి సంబంధించి అత్యంత దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీ సీఈవో పుట్టినరోజు, లేట్-నైట్ పార్టీలో మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి చేశారు. బాధితురాలిని ఇంట్లో దింపుతామని నమ్మించి, మార్గమధ్యలో మత్తు పదార్థం ఇచ్చి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు. డాష్‌క్యామ్ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన రోజు పార్టీ తర్వాత ఇంటి దగ్గర దింపుతామని చెప్పి కంపెనీ సీఈవో మరో ఇద్దరితో కలిసి కదులుతున్న కారులో మహిళా ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ కేసులో కంపెనీ సీఈవో జయేష్, మరో ఎగ్జిక్యూటివ్ గౌరవ్, అతని భార్య శిల్ప సహా ముగ్గురిని ఉదయ్ పూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకుని, తరువాత స్థానిక కోర్టు రిమాండ్‌కు తరలించారు.పోలీసుల ప్రకారం.. సీఈవో పుట్టిన రోజు సందర్భంగా శోభాగ్పురాలోని ఒక హోటల్లో రాత్రి 9 గంటల ప్రాంతంలో పార్టీ ప్రారంభమై దాదాపు తెల్లవారుజామున 1.30 గంటల వరకు కొనసాగింది. బాగా లేట్ అయింది కాబట్టి కారులో ఇంట్లో దింపుతామని ఆఫర్ చేశారు. దారి మధ్యలో సిగరెట్‌ను పోలిన మత్తు పదార్థాన్ని ఇచ్చారని బాధితురాలు ఆరోపించింది. అది తిన్న తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాననీ, అనంతరం తనపై కారులోనే అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. మెలకువ వచ్చిన తరువాత చెవిపోగులు, ముఖ్యంగా లోదుస్తులు మాయం కావడం ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు ఆమెలో భయాన్ని రేపాయి. దీంతో కారు డాష్‌క్యామ్ ఫుటేజీలో పరిశీలించాక జరిగిన దారుణమంతా రికార్డ్ అయిందని గుర్తించింది. డిసెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 21 తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ యోగేష్ గోయల్ తెలిపారు. బాధితురాలు లైంగిక వేధింపులకు గురయినట్టు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించినట్టు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును అదనపు పోలీసు సూపరింటెండెంట్ మాధురి వర్మకు అప్పగించారు. దర్యాప్తును మరింతగా కొనసాగించడానికి పోలీసులు కారులో ఏర్పాటు చేసిన డాష్‌క్యామ్ నుండి ఆడియో, వీడియో రికార్డింగ్‌లను కూడా పరిశీలిస్తున్నారు. -
కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయింది! అతని సాహసానికి హ్యాట్సాఫ్
Netherland Man Sacrifices His Car: మనం సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడూ ఏవరైనా కారు ర్యాష్‌గా డ్రైవ్ చేస్తే మనకు చాలా కోపం వస్తుంది. ఇన్ని భయంకరమైన ప్రమాదాలు జరిగిన అసలు వీళ్లకు బుద్ధి రాదు అని కూడా అనుకుంటాం. కానీ ఇక్కడొక వ్యక్తి కారుని ఇష్టారీతిన నడిపి ప్రమాదానికి గురవుతాడు. అయితే అతడి నిర్లక్షాన్ని క్షమించి ఆ కారుని కాపాడే ప్రయత్నం చేసి సహృదయం చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు.. (చదవండి: దెయ్యంతో ఆటలాడిన భౌ.. భౌ..!! వైరల్...) అసలు విషయంలోకెళ్లితే....ఇక్కడ రోడ్డు పై మూడు కార్లు వెళ్తుంటాయి. అందులో ఒక కారు ఉన్నటుండి నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అటు ఇటూ రకరకాలగా వెళ్తుంటుంది. ఈ విషయాన్ని మిగత కారుల్లో ప్రయాణిస్తున్న వాళ్లు గమనిస్తారు. మొదట ఏంటి ఇలా నడుపుతున్నాడు అని వాళ్లంతా అనుకుంటారు. అయితే కాసేపటికి వాళ్లకు అసలు విషయం అర్థమవుతోంది. ఆ కారుని నడుపుపతున్న మహిళ స్పృహ తప్పి పడిపోయిందని అందువల్లే కారు ఇష్టమొచ్చినట్లుగా వెళ్తోంది అని. అయితే ఆమెను ఎలాగైన కాపాడాలని అదే సమయంలో అక్కడ ప్రయాణిస్తున్న మిగతా కార్లలోని వాళ్లు అనుకుంటారు. అంతేకాదు అనుకున్నదే తడువుగా ఆమె కారు వెళ్లేందకు దారి ఇచ్చేసి తర్వాత ఆమె కారుకి ముందు ఒక కారుని అడ్డంగా పెట్టి ఢీ కొట్టేలా చేసి ఆపుతారు. అంతేకాదు ఆమె కారు వెనుక భాగంలో కూడా మరో కారు వచ్చి ఢీకొట్టి ఆ కారుని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆ కారు నడుపుతున్న మహిళను కాపాడతారు. అంతేకాదు రోడ్డుపై ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడటమే కాక తన కారుని అడ్డంగా పెట్టి రిస్క్ చేయడం చాలా ప్రశసించదగ్గ విషయం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: టీ పొడి వ్యాపారం చేద్దామనుకోవడమే వారిపాలిట శాపమైంది.. అదిరిపోయే ట్విస్ట్!!..) Man sacrifices his car to save another driver who was unconscious.. Via @RTVNunspeet pic.twitter.com/drgac0UDez — Buitengebieden (@buitengebieden_) November 21, 2021 -
డ్రామా ఆడిన వ్యక్తికే ఊహించని షాక్!
-
డ్రామా ఆడిన వ్యక్తికే ఊహించని షాక్!
డబ్బుల కోసం ఒక్కోవ్యక్తి ఒక్కో తరహాలో ఆలోచిస్తాడు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం అడ్డదారులను ఆశ్రయిస్తుంటారు. ప్రమాదం అని తెలిసి, అందులో వేరే వ్యక్తి తన వల్ల హత్యాయత్నం చేసులో ఇరుక్కున్నా పరవాలేదు అని భావించి ఓ వ్యక్తి చిన్న ట్రిక్ ప్లే చేసినా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో రోడ్డుపై ఎన్నో వాహనాలు వెళ్తున్నాయి. కోరోట్కోవ్ వ్యక్తి కారులో వెళ్తుంటే ఉద్దేశపూర్వకంగా గుర్తుతెలియని వ్యక్తి కారు కింద పడ్డట్లుగా నటించాడు. అయితే అతగాడి ప్రయత్నం కాస్త బెడిసికొట్టి ముక్కు, నోరు నుంచి కాస్త రక్తం వచ్చింది. కారు నడుపుతున్న కోరోట్కోవ్ కిందకి దిగగానే తనకు రక్తం కారుతుందని, అందుకు నీ నిర్లక్షపూరిత డ్రైవింగ్ కారణమని ఆరోపించాడు. తనకు డబ్బులు ఇస్తేనే అక్కడి నుంచి కదలాలని కోరోట్కోవ్ ను డిమాండ్ చేశాడు. కోరోట్కోవ్ ఏ మాత్రం భయపడకుండా.. 'నువ్వు ఉద్దేశపూర్వకంగానే నా కారు కింద పడాలని ట్రై చేశావు. డబ్బులు డిమాండ్ చేయడమే నీ టార్గెట్. కారులో ఉన్న డాష్ బోర్డ్ కెమెరా చూడు. ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది' అన్నాడు. పోలీసులకు ఫోన్ చేసి కోరోట్కోవ్ ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో కంగారుపడ్డ గుర్తుతెలియని వ్యక్తి నోరెత్తకుండా అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. మనీ రాకపోగా, గాయాలతో పరారు కావాల్సి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.


