హృదయాలను కలిచివేస్తున్న ఫోటో.. తల్లి కోసం..

Rhino Killed By Poachers In Kruger National Park - Sakshi

తల్లి బిడ్డల బంధం విడదీయలేనిది. అది మనుషులకైనా, పశుపక్ష్యాదులకైనా ఒక్కటే. తన బిడ్డకు చిన్న గాయం అయినా తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. అలాగే తల్లికి ఏ చిన్న హానీ కలిగినా బిడ్డ అంతే బాధపడుతుంది. తన తల్లిని చంపేందుకు వచ్చిన వేటగాళ్లను ఎదిరించే దమ్ములేకపోయినా.. తల్లిని రక్షించడం కోసం చివరిదాక ప్రయత్నం చేసింది ఓ పిల్ల ఖడ్గమృగం(రైనో). కానీ తల్లిని రక్షించేకోలేక గాయాలతో తల్లి శవం వద్దే పడిఉంది. ఇప్పుడా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ హృదయ విచారక ఘటన అఫ్రికాలోని క్రుగర్‌ నేషనల్‌ పార్క్‌లో జరిగింది. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరి హృదయం చలించిపోతుంది.

ఖడ్గమృగాల కొమ్ముల కోసం వేటగాళ్లు వాటిని చంపేస్తుంటారు. సాధారణంగా ఖడ్గ మృగం కొమ్ములు తీసుకొని వెళ్ళడానికి వేటగాళ్ళు వచ్చినప్పుడు.. వాటి పిల్లలను కూడా చంపేయడమో.. లేదా వాటికి మత్తుపదార్థాలు పెట్టడమో చేస్తూ ఉంటారు.  పిల్ల రైనోలు వారి పనికి అడ్డు తగిలే అవకాశం ఉంటుందని అలా చేస్తారు. 

వేటగాళ్లకు చిక్కిన ఓ ఖడ్గమృగాన్ని కాపాడేందుకు ఓ బుల్లి రైనో తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. ఒక్క నెల వయస్తున్న ఆ రైనో తన తల్లికి హానీ కలిగించడానికి వచ్చిన వేటగాళ్లను ఎదురించించింది. ఇంకా కొమ్ములు కూడా రాని ఆ బుల్లి రైనో తన తల్లిని రక్షించేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. చివరకూ వేటగాళ్ల చేతిలో గాయాలపాలై తల్లి శవం వద్దే పడిపోయింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్‌ అయింది. నెల వయస్సు ఉన్న రైనో తన తల్లికోసం అంత సాహసం చేయడం.. చివరకి వేటగాళ్ల చేతిలో ఓడిపోయి తల్లి శవం వద్ద దీనస్థితిలో పడిఉండడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. కాగా ఆ బుల్లి రైనోని సఫారీ జూ సిబ్బంది తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ అందిస్తోంది. దానికి ఆర్థర్‌ అని పేరు పెట్టి ట్రీట్‌మెంట్‌కోసం విరాళాలను కూడా సేకరిస్తోంది. దానికి గాయాలు ఎక్కడెక్కడ అయ్యాయో.. తల్లికోసం అది చేసిన సాహసం ఏంటో తెలుపుతూ విరాళాలు సేకరిస్తున్నారు. జంతూ ప్రేమికులు కూడా బుల్లి రైనో ఆర్థర్‌కు పెద్ద ఎత్తున సాయం అందిస్తున్నారు. ఆ విరాళాలతో ఇలా గాయపడిన ఎన్నో ఖడ్గమృగాలను రక్షిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top