ఆక్స్‌ఫర్డ్‌కు ఎన్నారై సోదరుల భారీ విరాళం | Reuben Brothers Donate 80 million Pounds To Oxford University | Sakshi
Sakshi News home page

ఆక్స్‌ఫర్డ్‌ కాలేజీకి రూ.770 కోట్ల విరాళం

Jun 12 2020 12:46 PM | Updated on Jun 12 2020 12:46 PM

Reuben Brothers Donate 80 million Pounds To Oxford University - Sakshi

రూబేన్‌ సోదరులు

భారతీయ సంతతికి చెందిన రూబేన్‌ సోదరులు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన పార్క్‌ కాలేజీకి దాదాపు రూ.770 కోట్లు విరాళమిచ్చారు.

లండన్‌: భారతీయ సంతతికి చెందిన రూబేన్‌ సోదరులు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన పార్క్‌ కాలేజీకి దాదాపు రూ.770 కోట్లు (8 కోట్ల పౌండ్లు) విరాళమిచ్చారు. స్కాలర్‌ షిప్‌ కార్యక్రమానికి ఈ నిధులను వెచ్చిస్తారు. డేవిడ్, సీమోన్‌ రూబేన్‌లు ముంబైకి చెందిన వారు. ది సండే టైమ్స్‌ గణాంకాలప్రకారం వీరిద్దరూ 16 బిలియన్‌ పౌండ్ల సంపదతో బ్రిటన్‌ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. రూబెన్ ఫౌండేషన్ ఇచ్చిన విరాళం చారిత్రాత్మకమని, పార్క్‌ కళాశాల ఇప్పుడు రూబెన్ కాలేజీగా మారిందని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. (అలసిపోయాం.. ఇక ఆపండి: జార్జ్‌ సోదరుడి ఆవేదన)

రత్తన్‌లాల్‌కు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌
న్యూయార్క్‌: ప్రముఖ భారత సంతతి అమెరికన్‌ శాస్త్రవేత్త రత్తన్‌లాల్‌(75)ను ప్రతిష్టాత్మక వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ వరించింది. 2020 సంవత్సరానికి సుమారు రూ.1.90 కోట్ల విలువైన ఈ బహుమతికి ఆయన్ను ఎంపిక చేసినట్లు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ పేర్కొంది. ‘రత్తన్‌లాల్‌ 50 ఏళ్లుగా నాలుగు ఖండాల్లో భూసార పరిరక్షణకు, 50 కోట్ల మంది రైతుల జీవనోపాధి పెంపునకు కృషి చేశారు. 200 కోట్ల ప్రజలకు ఆహార భద్రత కల్పించారు. వేలాది హెక్టార్ల భూమిలో సహజ ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలను కాపాడారు’ అని వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఆర్గనైజేషన్‌ కొనియాడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement