నా జీవితంలో అతి పెద్ద నిర్ణయం

Reopening The Economy The Biggest Decision Of My Life - Sakshi

కంటికి కనిపించని శత్రువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడానికి ఆంక్షల్ని ఎత్తి వేయడం పెను సవాల్‌గా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఆ నిర్ణయమే తన జీవితంలో అతి పెద్దదన్న ట్రంప్‌ దానిని ఎప్పుడు తీసుకుంటారో వెల్లడించలేదు. కోవిడ్‌ –19 దెబ్బతో అగ్రరాజ్యం సంక్షోభంలో పడిపోయింది. దేశంలోని 33 కోట్ల మందిలో  95 శాతానికి పైగా ఇళ్లకే పరిమితమయ్యారు. కొద్ది వారాల్లోనే 1.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 

వైట్‌ హౌస్‌లో శుక్రవారం ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రజల్ని ఇల్లు కదలవద్దన్న ఆంక్షల్ని ఎత్తి వేయడమే తాను జీవితంలో తీసుకోబోయే అతి పెద్ద నిర్ణయమని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టాలంటే ప్రజలందరూ మళ్లీ పనుల్లోకి రావాలని, దానికి తగిన సమయం కోసం చూస్తున్నామని అన్నారు.  ‘దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి ఆ దేవుడిపైనే భారం వేశారు. అయితే కచ్చితంగా ఆ నిర్ణయం నేను నా జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం అవుతుంది’అని ట్రంప్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top