
ఏళ్ల సమస్యకు పరిష్కారం దిశగా రష్యా..
జపాన్‌తో చక్కటి సంబంధాలు నెలకొల్పుకునేందుకు రష్యా సిద్ధమవుతోంది. టోక్యోతో ఎలాంటి ఘర్షణలకు దిగకూడదని ఆ దేశం భావిస్తోంది.
జపాన్-రష్యాల మధ్య గత కొంత కాలం నుంచి కురిల్ దీవుల విషయంలో వివాదం ఉంది. వాస్తవానికి ఈ దీవులు జపాన్‌వే అయినప్పటికీ 1945 రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యాకు అప్పగించింది. అప్పటి నుంచి ఈ దీవులు రష్యా ఆదీనంలో ఉన్నాయి. అయితే, ఈ దీవులు తమకే చెందుతాయంటూ అనంతరం జపాన్ పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య జరగాల్సిన శాంతి ఒప్పందం జరగకుండానే ఆగిపోయింది. దీంతో మరోసారి ఆ దిశగా రెండు దేశాలు పావులు కదుపుతున్నాయి.