అమెరికాలో హ్యాకింగ్‌ కలకలం.. | Prominent US Twitter accounts hacked | Sakshi
Sakshi News home page

హై ప్రొఫైల్‌ ట్విటర్‌ అకౌంట్ల హ్యాక్‌

Jul 16 2020 8:57 AM | Updated on Jul 16 2020 10:38 AM

Prominent US Twitter accounts hacked - Sakshi

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికాలో హై ప్రొఫైల్‌ ట్విటర్‌ అకౌంట్లే లక్ష్యంగా హ్యాకర్లు రెచ్చిపోయారు. వారి ట్విటర్‌ అకౌంట్లను హ్యాక్‌ చేసి బిట్‌కాయిన్‌ అడ్రస్‌కి వెయ్యి డాలర్లు పంపిస్తే, వెంటనే తిరిగి రెట్టింపు సొమ్ము పంపిస్తామంటూ మోసపూరిత ట్వీట్‌లు చేశారు. బ్లూ టిక్‌ ఉన్న అకౌంట్ల నుంచి ఈ ట్వీట్‌లు రావడంతో నిజమేననుకొని వారి అభిమానులు కొందరు భారీ మొత్తంలో హ్యాకర్లకు డబ్బులు కూడా పంపించినట్టు తెలుస్తోంది. హ్యాకింగ్‌కు గురైన అకౌంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌, అపర కుబేరులు ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, నటి కిమ్‌ కర్ధాషియన్‌లతోపాటూ పలువురు ప్రముఖులు ఉన్నారు. (అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట)

హ్యాకింగ్‌ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్విటర్‌ సీఈఓ జాక్‌ డోర్సే పేర్కొన్నారు. నష్టాన్ని నివారించే పనిలో ఉన్నామని, హ్యాకింగ్‌కు పాల్పడింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ట్వీట్‌ చేశారు. (కరోనా: అమెరికాలో రికార్డు స్థాయిలో కేసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement