బుష్‌ గౌరవార్థం ‘స్పెషల్‌ ఎయిర్‌మిషన్‌ 41’

President Bush boards Special Air Mission 41 - Sakshi

హూస్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు దివంగత జార్జ్‌ హెచ్‌.డబ్ల్యూ.బుష్‌ భౌతికకాయాన్ని వాషింగ్టన్‌ తీసుకెళ్లేందుకు అధ్యక్షుడి అధికారిక విమానం ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’ హూస్టన్‌కు చేరుకుంది. బుష్‌ గౌరవార్థం ఈ విమానానికి తాత్కాలికంగా ‘స్పెషల్‌ ఎయిర్‌మిషన్‌ 41’గా పేరుపెట్టారు. వాషింగ్టన్‌లోని నేషనల్‌ క్యాథడ్రల్‌ చర్చిలో అధికారిక లాంఛనాలతో ఓసారి, హూస్టన్‌లోని సెయింట్‌మార్టిన్‌ ఎపిస్కోపల్‌ చర్చిలో మరోసారి బుష్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. గురువారం హూస్టన్‌లో ఆయన భార్య బార్బరా, కుమార్తె రాబిన్‌ పక్కన బుష్‌ పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. మరోవైపు, బుష్‌ భౌతికకాయం వద్ద ఆయన పెంపుడు శునకం సల్లీ విచారంగా పడుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top