అంత్యక్రియల్లో అశ్లీల వీడియో | porn vedio played at funeral instead of memorial video | Sakshi
Sakshi News home page

అంత్యక్రియల్లో అశ్లీల వీడియో

Feb 6 2016 10:44 AM | Updated on Sep 18 2018 8:00 PM

అంత్యక్రియలు జరిగిన ప్రాంతం (ఇన్ సెట్: సైమన్) - Sakshi

అంత్యక్రియలు జరిగిన ప్రాంతం (ఇన్ సెట్: సైమన్)

నెలలు నిండిన తన భార్యతో కలిసి కారులో బయలుదేరిన సైమన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కడుపులోని బాబు కూడా ప్రాణాలు కోల్పోయాడు..

నెలలు నిండిన తన భార్యతో కలిసి కారులో బయలుదేరాడు సైమన్ లెవీస్. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నైట్ క్లబ్ వైపునకు దూసుకెళుతున్నవాళ్లకు మరో కారు అడ్డంతగిలింది. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ప్రమాదంలో సైమన్ అక్కడికక్కడే చనిపోయాడు. స్పృహకోల్పోయిన ఆయన భార్యను ఎవరో ఆసుపత్రిలో చేర్పించారు.

 

రెండు రోజుల తర్వాత ఆపరేషన్ చేసి కడుపులోనే చనిపోయిన శిశువును బయటికితీశారు డాక్టర్లు. ప్రమాదం జరిగిన రోజే కడుపులో ఉన్న బిడ్డ తీవ్రంగా గాయపడి చనిపోయాడు. భార్య ఆసుపత్ని నుంచి కోలుకున్న తర్వాత సైమన్, తల్లికడుపులోనే చనిపోయిన అతడి కొడుకుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి.

వాళ్ల సొంత ఊరు కార్డిఫ్ లోని చర్చికి సమీపంలోగల స్మశానవాటికలో అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. రెండు పార్థివదేహాలను ఉద్దేశించి పాస్టర్ ప్రార్థనలు చేశారు. పూడ్చిపెట్టడానికి ముందు మరోసారి జ్ఞాపకాలను తల్చుకునేందుకు అక్కడ ఏర్పాటుచేసిన స్క్రీన్లపై సైమన్ కు సంబంధించిన గత వీడియాలను ప్లే చేయాల్సిందిగా పాస్టర్ ఆదేశించారు. వీడియో మొదలవుతూనే అక్కడున్నవారి ముఖాల్లో ఆందోళన మిన్నంటింది. సైమన్ జ్ఞాపకాలకు బదులు అక్కడ ప్లే అయింది ఓ హార్డ్ కోర్ పోర్న్ వీడియో!

క్షణాల్లో తేరుకున్న కార్యక్రమ నిర్వాహకులు వీడియో ప్రసారాన్ని ఆఫ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సాంకేతిక సమస్యవల్ల దాదాపు ఐదునిమిషాలపాటు ఆ వీడియో అలా ప్లే అవుతూనేఉంది. చివరికి ఓ ఇంజనీర్ వచ్చి సెట్టింగ్స్ మార్చాకగానీ అశ్లీలదృశ్యాల ప్రసారం ఆగిపోలేదు. జనవరి 28న చోటుచేసుకున్న ఈ సంఘటన వేల్స్(యూకే)లో చర్చనీయాంశమైంది. అంత్యక్రియల నిర్వాహకుల తీరుపై సైమన్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేయగా, 30 ఏళ్ల సర్వీసులు ఇలాంటి పొరపాటుజరగటం మొదటిసారని, ఈ ఒక్కసారీ క్షమించాలని వేడుకున్నారు స్మశానవాటిక సిబ్బంది.

Advertisement
 
Advertisement
Advertisement