ఇక పోర్న్ చూడాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి! | Porn site age verification laws could force users to register credit cards | Sakshi
Sakshi News home page

ఇక పోర్న్ చూడాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి!

May 18 2016 7:22 PM | Updated on Sep 18 2018 7:50 PM

ఇక పోర్న్ చూడాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి! - Sakshi

ఇక పోర్న్ చూడాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి!

ఇక అశ్లీల చిత్రాలు చూడాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనున్నారు. అశ్లీల చిత్రాలు యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న నేపథ్యంలో ఆ సమస్యను ఎదుర్కొనేందుకు బ్రిటన్ ఈమేరకు గట్టి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.

లండన్: ఇక అశ్లీల చిత్రాలు చూడాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనున్నారు. అశ్లీల చిత్రాలు యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న నేపథ్యంలో ఆ సమస్యను ఎదుర్కొనేందుకు బ్రిటన్ ఈమేరకు గట్టి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇది వరకే పెట్టుకున్న నిబంధనలు ఇక కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.

గతంలో పెట్టిన నిబంధనలు అతిక్రమించి పోర్న్ సైట్లు చూసేలా సదరు సైట్లు అవకాశం కల్పించడంతో చిన్నపిల్లలు సైతం వాటిని వీక్షిస్తున్నారని.. ఆ ప్రభావం వారి పెరుగుదలపై పడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పోర్న్ సైట్ చూసే వారు తమ వయసు నిర్ధారణ పకడ్బందీగా చేసుకున్నాకే వాటిని చూసే అవకాశం కల్పించాలని భావిస్తుంది.

వీటిని చూడాలనుకునే వారు తమ క్రెడిట్ కార్డును ఉపయోగించి దాని ద్వారా తమ వయస్సు నిర్దారణ చేసుకోవాలనే నిబంధన తీసుకురానుంది. ఈ నిబంధన ప్రతి పోర్న్ సైట్ పాటించాలని లాగిన్ అయ్యే వారికి వయస్సు నిర్ధారణ ప్రశ్నలో భాగంగా క్రెడిట్ కార్డు డిటెయిల్స్ కోరాలని దాని ద్వారా మాత్రమే వయో నిర్థారణ చేసుకొని వాటిని చూసే ఏర్పాట్లు చేసుకోవాలనే నిబంధనను ఇక అమల్లోకి తీసుకురానున్నారు.

గతంలో తాము విధించిన నిబంధనలు పోర్న్ సైట్లే పాటించకపోవడంతో దానిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బ్రిటన్ రాణి డిజిటల్ ఎకానమీ అంశంపై ఇచ్చిన ప్రసంగంలో భాగంగా ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఇక క్రెడిట్ కార్డులతో మాత్రమే యూజర్లు సైన్ చేసుకొని వయస్సు నిర్థారణ అయిన తర్వాతే  పోర్న్ వీడియోలు చూసే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement