పోప్‌ ఫ్రాన్సిస్‌కు గాయాలు | Pope Bumps Head, Hurts Left Eye While Riding Popemobile In Colombia | Sakshi
Sakshi News home page

పోప్‌ ఫ్రాన్సిస్‌కు గాయాలు

Sep 11 2017 9:04 AM | Updated on Sep 19 2017 4:22 PM

పోప్‌ ఫ్రాన్సిస్‌కు గాయాలు

పోప్‌ ఫ్రాన్సిస్‌కు గాయాలు

క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌కు గాయాలు అయ్యాయి.

కార్టాజెనా : క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌కు గాయాలు అయ్యాయి. తనకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఓపెన్‌ టాప్‌ వాహనంలో కొలంబియాలో భారీ జన సమూహం మధ్య పర్యటిస్తున్న ఆయన అనూహ్యంగా పట్టుతప్పి వాహనంలో నిలువుగా ఉన్న ఇనుప కడ్డీకి తాకడంతో స్వల్పంగా గాయాలు అయ్యాయి. కొన్ని రక్తపు బిందువులు కూడా పడ్డాయి.

ఈ కారణంగా తలకు చిన్న బొప్పి కట్టడంతో దవడ ఎముక భాగంలో, ఎడమకంటి పక్కన చిన్న గాయాలయ్యాయి. అయితే, దీనికి సంబంధించి వాటికన్‌ సిటీ ప్రకటన చేస్తూ పోప్‌కు స్వల్పగాయమే అయిందని, కంగారు పడాల్సిన పనిలేదని చెప్పింది. ప్రస్తుతం ఆయనకు ఐస్‌తో ట్రీట్‌మెంట్‌ చేశారని, ఆయన పర్యటన కొనసాగుతుందని వెల్లడించింది. తనకు గాయం అవగానే 'నాకు పంచ్‌ పడింది.. నేను బానే ఉన్నాను' అంటూ పోప్‌ జోక్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement