ఫోర్బ్స్ జాబితాలో ముందుకెళ్లిన మోదీ | pm modi 9th plase in forbes list.. putin again first plase | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్ జాబితాలో ముందుకెళ్లిన మోదీ

Nov 4 2015 8:19 PM | Updated on Aug 15 2018 2:20 PM

ఫోర్బ్స్ జాబితాలో ముందుకెళ్లిన మోదీ - Sakshi

ఫోర్బ్స్ జాబితాలో ముందుకెళ్లిన మోదీ

ఫోర్బ్స్ శక్తివంతుల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిదో స్థానం దక్కించుకున్నారు. ప్రపంచ శక్తివంతులైన వ్యక్తుల జాబితా-2015ను ఫోర్బ్స్ బుధవారం సాయంత్రం విడుదల చేసింది.

న్యూయార్క్: ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిదో స్థానం దక్కించుకున్నారు. మొత్తం 73మందితో కూడిన ప్రపంచ శక్తిమంతుల జాబితా-2015ను ఫోర్బ్స్ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ జాబితాలో గత ఏడాది మోదీ 15వ స్థానంలో నిలిచారు.

ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోగా, ఈసారి జర్మనీ వైఎస్ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ రెండో స్థానం, గతేడాది రెండో స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఒబామా మూడో స్థానంలో ఉన్నారు. ఇక, మోదీ తర్వాత భారత్ నుంచి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 36 స్థానంలో ఉండగా భారత సంతతికి చెందిన లక్ష్మీ మిట్టల్ 55, సత్యనాదెళ్ల 61 స్థానంలో నిలిచారు.

టాప్ టెన్ శక్తిమంతులు వీరే...
1. వ్లాదిమిర్ పుతిన్ (63)
2. యాంజెలా మెర్కెల్ (61)
3. బరాక్ ఒబామా (54)
4. పోప్ ఫ్రాన్సిస్ (78)
5. జి జిన్ పింగ్ (62)
6. బిల్ గేట్స్ (78)
7. జానెట్ ఎల్లెన్ (69)
8. డేవిడ్ కామెరాన్ (49)
9. నరేంద్ర మోదీ (65)
10. లారీ పేజ్ (42)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement