ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడి రోత చర్యలు

Philippines President Kisses 5 Volunteers On Stage - Sakshi

మనీలా : ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె (73) ఓ దేశాధ్యక్షుడిగా కంటే కూడా అసభ్యకర వ్యాఖ్యలు, రోత చేష్టలు చేసే మనిషిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మహిళలంటే ఈ దేశాధినేతకు చాలా చిన్న చూపు. వారిని కేవలం లైంగిక ఆనందం అందించే ఓ వస్తువుగా మాత్రమే చూస్తారు. ఆయన మాటలు, చేష్టల పట్ల ఎంతమంది దుమ్మెత్తిపోసినా.. దున్నపోతు మీద వర్షం కురిసినట్లే గానీ.. ఇతను మాత్రం మారడు. తాజాగా ఈ ప్రబుద్ధుడు ఓ చండాలమైన పని చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. స్వదేశంలోనే కాక అతిథిగా వెళ్లిన దేశంలో కూడా తన నీచ బుద్ధిని బయటపెట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల పర్యటన ముగింపులో భాగంగా జపాన్‌లో నివసిస్తున్న ఫిలిప్పీన్స్‌ వాసులతో టోక్యోలో సమావేశమయ్యారు రోడ్రిగో. ఈ క్రమంలో కార్యక్రమం ముగిసిన తర్వాత తాను ముద్దుపెట్టుకొనేందుకు వీలుగా ఐదుగురు మహిళా వలంటీర్లను వేదికకు దగ్గరగా కూర్చోవాలని కోరాడు రోడ్రిగో. వీరిలో మొదటి మహిళ రోడ్రిగోను ముద్దు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. తన పెదవులపై, మెడపై ముద్దు పెట్టుకోవద్దని ఆమె కోరింది. దాంతో రోడ్రిగో ఆ మహిళ చెంపలపై ముద్దుపెట్టుకొని పంపించారు. అనంతరం రెండో మహిళది అదే పరిస్థితి. అయినా రోడ్రిగో తీరు మారలేదు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు వేదికపై రోత చేష్టలు

మూడో మహిళను ముద్దుపెట్టుకొని ఫోటోకి పోజు ఇచ్చారు. మిగిలిన ఇద్దరు కూడా అలానే చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ తతంగం ముగిసిన తర్వాత రోడ్రిగో ‘సాధారణంగా నేను పెదవులపైనే ముద్దు పెట్టుకొంటాను. ఈ రోజు నేను గే(నపుంసకుడు) కాకుండా ఈ మహిళలు సాయం చేశారు’ అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. తన విమర్శకుడు సెనెటర్‌ ఆంటోనియోను ‘హోమో’గా వర్ణించారు. 74 ఏళ్ల ఈ ముసలి అధ్యక్షుడు తన భార్య కళ్ల ముందే ఇలా ఇతర మహిళల్ని ముద్దు పెట్టుకోవడం గమనార్హం.

అయితే విదేశాల్లో నివసిస్తున్న తన దేశీయులను ముద్దు పెట్టుకోవడం రోడ్రిగోకు ఇదే మొదటి సారికాదు. 2018 జూన్‌లో కూడా సియోల్‌లో పని చేస్తున్న వివాహితను రోడ్రిగో ముద్ద పెట్టుకున్నారు. ఆమెకు వివాహం అయిందని తెలిసినా వదిలిపెట్టలేదు. (చదవండి : పెదాలపై ముద్దు.. తీవ్ర విమర్శలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top