ఆందోళనల్లో పేపర్‌ బాంబు పేలుడు | paper bomb blast | Sakshi
Sakshi News home page

ఆందోళనల్లో పేపర్‌ బాంబు పేలుడు

Feb 22 2017 2:24 PM | Updated on Aug 14 2018 3:25 PM

ఆందోళనల్లో పేపర్‌ బాంబు పేలుడు - Sakshi

ఆందోళనల్లో పేపర్‌ బాంబు పేలుడు

ఇటలీ పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం పేపర్‌బాంబు పేలింది.

రోమ్‌: ఇటలీ పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం పేపర్‌బాంబు పేలింది. గత కొద్ది రోజులుగా అక్కడి ట్యాక్సీల డ్రైవర్లు యాప్‌ బేస్డ్‌ సర్వీసులైన ఉబెర్‌ తదితర సంస్ధలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. యాప్‌ బేస్డ్‌ సంస్ధలపై రెగ్యులేషన్‌ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని అక్కడి ప్రభుత్వం గతంలో చెప్పింది. హామీని వెంటనే నెరవేర్చాలని ఆరు రోజులుగా అక్కడి డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
 
మంగళవారం నిరసనకారులతో ఇటలీ రవాణా శాఖ మంత్రి చర్చించాల్సివుండగా అంతకు కొద్దిసేపటి ముందే పేపర్‌ బాంబు పేలింది. దీంతో నిరసనకారుల్లో కొంతమంది ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారున. ఇంతలో పోలీసులపై నిరసనకారులు గాజు సీసాలు విసిరారు. స్ధానికంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లపై దాడి చేసి అక్కడి వస్తువులు ధ్వంసం చేశారు. పరిస్ధితి చేయి దాటకముందే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
 
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో షేర్‌ అవుతున్నాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ​ల్లో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గత కొద్ది రోజులుగా సాగుతున్న ట్యాక్సీల స్ట్రైక్‌ నుంచి గర్భిణీలకు, దేవాంగులకు, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement