breaking news
paper bomb
-
ఆందోళనల్లో పేపర్ బాంబు పేలుడు
రోమ్: ఇటలీ పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం పేపర్‌బాంబు పేలింది. గత కొద్ది రోజులుగా అక్కడి ట్యాక్సీల డ్రైవర్లు యాప్ బేస్డ్ సర్వీసులైన ఉబెర్ తదితర సంస్ధలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. యాప్ బేస్డ్ సంస్ధలపై రెగ్యులేషన్ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని అక్కడి ప్రభుత్వం గతంలో చెప్పింది. హామీని వెంటనే నెరవేర్చాలని ఆరు రోజులుగా అక్కడి డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నిరసనకారులతో ఇటలీ రవాణా శాఖ మంత్రి చర్చించాల్సివుండగా అంతకు కొద్దిసేపటి ముందే పేపర్ బాంబు పేలింది. దీంతో నిరసనకారుల్లో కొంతమంది ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారున. ఇంతలో పోలీసులపై నిరసనకారులు గాజు సీసాలు విసిరారు. స్ధానికంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లపై దాడి చేసి అక్కడి వస్తువులు ధ్వంసం చేశారు. పరిస్ధితి చేయి దాటకముందే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో షేర్ అవుతున్నాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణల్లో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గత కొద్ది రోజులుగా సాగుతున్న ట్యాక్సీల స్ట్రైక్ నుంచి గర్భిణీలకు, దేవాంగులకు, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. -
పేలిన పేపర్ బాంబు
ఇటాలీయన్ పార్లమెంట్‌కు దగ్గరలోనే మంగళవారం పేపర్ బాంబు పేలింది. ఈ విషయంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేస్తోంది. దీనికి స్పందించిన కార్ డ్రైవర్లు ఆరు రోజులపాటు సమ్మెకు దిగారు. , ఇటలీ రవాణాశాఖ మంత్రి గ్రజీయానో డెర్లియో ట్యాక్సి డ్రైవర్ల ప్రతినిధులతో మాట్లాడి డ్రైవర్లు సమ్మే విరమించేలా చేయాలని సూచించారు. ఈ బాంబు ప్రేలుడులో ఏ ఒక రాజకీయ నాయకుడుగాని, పోలీసులు గానీ గాయపడలేదని డ్రైవర్లు తెలిపారు. అంతేకాక పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఒక విలేఖరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొంతమంది డెమోక్రటిక్ పార్టీ హెడ్‌క్వార్టర్స్ వైపు గూడ్లు విసిరారు. కార్ డ్రైవర్లు మాట్లాడుతూ 2017 చట్టం నమూనాలో కార్ల అద్దె,కార్-షేర్ సేవలు కంట్రోల్ చేయాలని పేర్కొన్నారు. సమ్మే సమయంలో కూడా ఆసుపత్రులకు, గర్భణీలకు ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.