చైనాకు పాక్‌ గాడిదల ఎగుమతి! | Pak's kick-ass idea: Export donkeys to China | Sakshi
Sakshi News home page

చైనాకు పాక్‌ గాడిదల ఎగుమతి!

Apr 10 2017 1:32 AM | Updated on Sep 5 2017 8:22 AM

చైనాకు పాక్‌ గాడిదల ఎగుమతి!

చైనాకు పాక్‌ గాడిదల ఎగుమతి!

చైనాతో వ్యాపార సంబంధాలు పెంచుకుంటున్న పాకిస్తాన్‌ ఆ దేశానికి గాడిదలను కూడా ఎగుమతి చేయాలని యోచిస్తోంది.

పెషావర్‌: చైనాతో వ్యాపార సంబంధాలు పెంచుకుంటున్న పాకిస్తాన్‌ ఆ దేశానికి గాడిదలను కూడా ఎగుమతి చేయాలని యోచిస్తోంది. దీని కోసం వంద కోట్ల డాలర్లతో గాడిదల అభివృద్ధి పథకాన్ని ప్రతిపాదించింది.

46 బిలియన్ల(రూ. 6,447 కోట్లు) విలువైన చైనా–పాక్‌ ఆర్థిక కారిడార్‌లో ఖైబర్‌–పక్తూన్‌ఖ్వా–చైనా సంతులిత గాడిదల అభివృద్ధి పథకం ఒకటని, ఖైబర్‌–పక్తూన్‌ఖ్వా రాష్ట్రానికి చైనా పెట్టుబడులను రప్పించేందుకు దీన్ని ప్రతిపాదించారని మీడియా తెలిపింది. రాష్ట్రంలోని గాడిదల చర్మానికి చైనాలో డిమాండ్‌ ఉందని, దాన్ని ఔషధాల తయారీ వంటివాటిలో వాడుతున్నారని ఓ అధికారిక పత్రంలో పేర్కొన్నారు. ఈ పథకం వల్ల గాడిదల పెంపకందారులకు లభ్ధి కలుగుతుందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement