కోరిక చంపుకోనందుకు.. భర్తపై కాల్పులు! | pakistan Woman kills Hubby For Sexually Abusing Daughter in law | Sakshi
Sakshi News home page

కోరిక చంపుకోనందుకు.. భర్తపై కాల్పులు!

Jun 4 2017 5:20 PM | Updated on Aug 21 2018 3:16 PM

కోరిక చంపుకోనందుకు.. భర్తపై కాల్పులు! - Sakshi

కోరిక చంపుకోనందుకు.. భర్తపై కాల్పులు!

ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన ఓ సీనియర్ సిటిజన్ హత్య కేసులో ఆసక్తికర నిజాలు వెలుగుచూశాయి.

పెషావర్: ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన ఓ సీనియర్ సిటిజన్ హత్య కేసులో ఆసక్తికర నిజాలు వెలుగుచూశాయి. తొలుత ఏదో వివాదంలో భర్తను భార్య హత్య చేసి ఉండొచ్చునని పోలీసులు భావించారు. అయితే కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని భర్తను హత్య చేశానని మహిళ ఒప్పుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాకిస్తాన్ కైబర్ కనుమలలోని షాంగ్లా గుల్బర్ ఖాన్ తన భార్య బేగమ్ బిబితో కలిసి నివాసం ఉంటున్నాడు.

వీరి కుమారుడు పాక్ ఆర్మీ ఓ విభాగంలో సైనికుడిగా సేవలు అందిస్తున్నాడు. అతడి భార్య అత్తమామల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో మామ ఖాన్ కోడలిపై కన్నేశాడు. మొదట్లో తన భార్య, కొడుకు లేని సమయాల్లో ఆమెను లైంగికంగా వేధించేవాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని హింసించేవాడు. గత మూడు నెలలుగా మామ వేధింపులు తీవ్రం కావడంతో భర్తకు తన బాధను చెప్పుకుంది. తండ్రిని ఏం చేయమంటావో చెప్పమని తల్లి బేగమ్ ను కుమారుడు అడిగాడు. కోడలితో అసభ్యంగా ప్రవర్తించవద్దని పలుమార్లు భర్త ఖాన్ ను భార్య బేగమ్ హెచ్చరించింది.

ఈ క్రమంలో కుమారుడు దఆర్మీ క్యాంపు ట్రైనింగ్ నిమిత్తం వెళ్లాడు. కోడలిపై తన భర్త కోరికలు చంపుకునేందుకు సిద్ధంగా లేడని బేగమ్ బిబి ఆగ్రహించింది. దీంతో నిద్రపోతున్న సమయంలో కోడలితో కలిసి తుపాకీతో భర్తపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అతడిని హత్య చేసినట్లు పోలీసులకు బేగమ్ వివరించింది. బేగమ్ తో పాటు ఆమె కోడలిపై కేసు నమోదు చేసిన పోలీసులు వీరిని శనివారం కోర్టులో ప్రవేశపెట్టగా వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement