తీరని విషాదం : ముగ్గురు మృత్యుంజయులు

In Pakistan plane crash with 99 on board, at least 2 miraculous survivors - Sakshi

కరాచీ : కరాచీ విమాన ప్రమాదంలో మొత్తం ప్రయాణీకులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని భావిస్తున్న తరుణంలో  ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారన్న భారీ ఊరట నిస్తోంది.  బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్, ప్రభుత్వ రంగ సంస్థ అర్బన్ యూనిట్ సీఈవో ఖాలిద్ షెర్డిల్  క్షేమంగా బయడపడ్డారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు తెలిపారు.   అలాగే అమర్ రషీద్ అనే  మరో యువకుడు కూడా  ఈ ప్రమాదంనుంచి బయటపడడం మిరాకిల్. ఈ విషయాన్ని రషీద్  బంధువులు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. (కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు)

పాకిస్తాన్ జియో న్యూస్ ప్రకారం, ప్రాణాలతో బయటపడిన వారిలో  జాఫర్ మసూద్ ను  ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం స్థలంనుంచి  ఇప్పటికి 34 మృతదేహాలను వెలికితీయగా, వీరిలో  ఇద్దరు పైలట్ల మృతదేహాలను గుర్తించారు. ఇంకా 24 న్యూస్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్టు అన్సార్ నఖ్వీ ఈ ప్రమాదంలో అసువులు బాసారు. వీరితో పాటు స్థానికులు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.సెకండ్ లెఫ్టినెంట్ హమ్జా యూసుఫ్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. పరేడ్ ముగిసిన తరువాత హంజా మొదటిసారి ఈద్ పర్వదినం సందర్భంగా ఇంటికి  వెళుతున్నారు. (ఘోర ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?)


హమ్జా యూసఫ్

మృతులు (స్థానికి మీడియా సమాచారం ఆధారంగా)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top