పాకిస్తాన్‌ను పణంగా పెడతారా?!

Pakistan opposes sale of armed drones to India - Sakshi

ఇస్లామాబాద్‌ : భారత్‌కు అమెరికా ఆర్మ్‌డ్‌ డ్రోన్లను విక్రయించడాన్ని పాకిస్తాన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత్‌కు శక్తివంతమైన ఆర్మ్‌డ్‌ డ్రోన్లను విక్రయించడం వల్ల.. ఆసియాలో ఆయుధ సమతుల్యం, శాంతి దెబ్బతింటాయని అమెరికాతో పాకిస్తాన్‌ పేర్కొంది. అంతేకాక సరిహద్దు దేశాలతో భారత్‌ ఆయుధ పెత్తనం చేసే అవకాశముందని పాకిస్తాన్‌ చెబుతోంది. ఆర్మ్‌డ్‌ డ్రోన్లను భారత్‌కు విక్రయించాలన్న ఆలోచనను పక్కన పెట్టాలని ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ను పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్‌ జకారియా  కోరారు.

ఆసియాలోనూ, సరిహద్దు దేశాలతోనూ ప్రాంతీయ స్థిరత్వం కోసం పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోందని జకారియా తెలిపారు. ఇప్పటికే సైనిక, ఆయుధ సంపత్తిలో ముందున్నభారత్‌.. ఆర్మ్‌డ్‌ డ్రోన్లను సమకూర్చుకుంటే.. అది పొరుగు దేశాలకు ఇబ్బందికరమని ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ను జకారియా తెలిపారు.

భారత్‌కు ఆర్మ్‌డ్‌ డ్రోన్లు, మిస్సైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రిజిమీ (ఎంటీసీఆర్‌) టెక్నాలజీని సరఫరా చేసే విషయంలో అమెరికా.. బహుపాక్షిక ఎగుమతి పద్దతులను ఒక్కసారి పరిశీలించాలని ఆయన జకారియా డిమాండ్‌ చేశారు. భారత్‌కు ఆర్మ్‌డ్‌ డ్రోన్లు, ఎంటీసీఆర్‌ టెక్నాలజీని అందించడం అంటే.. పాకిస్తాన్‌ను పణంగా పెట్టడమేనని జకారియా ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ను స్పష్టం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top