కుప్పకూలిన పాక్‌ విమానం

 Pakistan International Airlines Plane Crashes in Karachi - Sakshi

విమానంలో 99 మంది

57 మృతదేహాల వెలికితీత

కరాచీ: పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీలో శుక్రవారం మధ్యాహ్నం జనావాస ప్రాంతంలో ప్రయాణికుల విమానం కుప్పకూలింది. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన ఈ విమానంలో మొత్తం 99 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎంతమంది చనిపోయారనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఘటనాస్థలం నుంచి 57 మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. బ్యాంక్‌ ఆఫ్‌ పంజాబ్‌ ప్రెసిడెంట్‌ జఫర్‌ మసూద్‌ సహా ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కరోనా లాక్‌డౌన్‌ అనంతరం పాకిస్తాన్‌లో గతవారమే పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను పునఃప్రారంభించారు.

ల్యాండింగ్‌ గేర్‌లో సమస్య  
లాహోర్‌ నుంచి వస్తున్న పీకే–8303 విమానం మరికొద్ది క్షణాల్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్‌ కానుండగా, విమానాశ్రయం పక్కనే ఉన్న జిన్నా గార్డెన్‌ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ పీఐఏ ఎయిర్‌బస్‌ ఏ320 విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 31 మంది మహిళలు, 9మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ల్యాండింగ్‌ గేర్‌లో సమస్య ఏర్పడిందని కూలిపోవడానికి కాసేపటి ముందు పైలట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారమిచ్చారు.

ఈ ఘటనపై పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ, ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రధాని ఇమ్రాన్‌ అధికారులను ఆదేశించారు. తక్షణమే సహాయ చర్యల్లో పాలు పంచుకోవాలని ఆర్మీని జనరల్‌ బజ్వా ఆదేశించారు. విమానం కూలిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమైన దృశ్యాలను స్థానిక వార్తా చానళ్లు ప్రసారం చేశాయి.

ధ్వంసమైన ఇళ్లలో నుంచి పలు మృతదేహాలను వెలికితీశామని పోలీసులు, సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న సిబ్బంది తెలిపారు. అలాగే, పలువురు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామన్నారు. కనీసం 25 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.  కాగా, విమానంలో ఎంతమంది ఉన్నారనే విషయంలో అధికారులు వేర్వేరు రకాలైన సమాచారం ఇచ్చారు. అయితే, 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని  పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ) అధికార ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్‌ వెల్లడించారు.

మధ్నాహ్నం 2.37 గంటల సమయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు నిలిచిపోయాయని హఫీజ్‌ తెలిపారు. సాంకేతిక సమస్య ఏర్పడిందన్న పైలట్‌ సజ్జాద్‌ గుల్‌తో.. ల్యాండింగ్‌కు రెండు రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని కంట్రోల్‌ టవర్‌ అధికారులు చెప్పారని పీఐఏ చైర్మన్‌ అర్షద్‌ మాలిక్‌ తెలిపారు. కూలే ముందు విమానం రెక్కల్లో నుంచి మంటలు వచ్చాయని, ఆ తరువాత క్షణాల్లోనే అది ఇళ్లపై కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-06-2020
Jun 04, 2020, 15:30 IST
సాక్షి, విజయవాడ : కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జూన్‌ 8వ తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు ఏపీ...
04-06-2020
Jun 04, 2020, 15:26 IST
సాక్షి, న్యూఢిల్లీ : అది మే 23వ తేదీ. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కబీర్‌ కత్రి...
04-06-2020
Jun 04, 2020, 14:19 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా బారిన పడిన తన భర్తను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారని, అయితే ఇప్పటి వరకు తనకు ఎటువంటి సమాచారం...
04-06-2020
Jun 04, 2020, 14:00 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ బాధితుడి ఇంటికి కన్నం వేశారు దొంగలు. ఈ సంఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌...
04-06-2020
Jun 04, 2020, 13:49 IST
ఆలేరు రూరల్‌:  మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు బుధవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మండల వైద్యాధికారిణి...
04-06-2020
Jun 04, 2020, 11:00 IST
నాంపల్లి: నగరంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.20 వేల  చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు  తెలంగాణ ప్రెస్‌...
04-06-2020
Jun 04, 2020, 10:48 IST
వాషింగ్టన్‌: అమెరికా పోలీసుల చేతిలో నరహత్యకు గురైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ పూర్తి శవపరీక్ష నివేదికను వైద్యులు బుధవారం విడుదల...
04-06-2020
Jun 04, 2020, 10:30 IST
భారత్‌లో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
04-06-2020
Jun 04, 2020, 10:22 IST
సాక్షి,  ముంబై: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో ఆదాయాలను కోల్పోయిన పలు సంస్థలు ఉద్యోగాల కోత, వేతనాలు తగ్గింపు లాంటి నిర్ణయాలు...
04-06-2020
Jun 04, 2020, 09:57 IST
ఢిల్లీ : భార‌త ర‌క్ష‌ణ శాఖలో కరోనా క‌ల‌క‌లం రేగింది. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న ర‌క్ష‌ణశాఖ కార్య‌ద‌ర్శి...
04-06-2020
Jun 04, 2020, 09:32 IST
ఢిల్లీ: బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వచ్చేవారు ఖచ్చితంగా వారం రోజుల పాటు హోం...
04-06-2020
Jun 04, 2020, 09:00 IST
టి.వి. చూస్తున్నాడు. ఓ.కే. ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతున్నాడు. ఓ.కే.ఇంట్లో అటూ ఇటూ చక్కర్లు కొడుతున్నాడు.ఓ.కే.కాని ఫ్రెండ్స్‌ని కలవట్లేదు. ఫ్రెండ్స్‌తో ఆడే...
04-06-2020
Jun 04, 2020, 08:52 IST
జూబ్లీహిల్స్‌: చీకట్లను చీల్చుకుంటూ వచ్చే కిరణాలు వెండితెరపై పడగానే ఆ తెర ఒక్కసారిగా వెలుగులీనుతుంది. అదే వెండి తెర ఇప్పుడు...
04-06-2020
Jun 04, 2020, 08:43 IST
కోవిడ్‌-19 చికిత్సకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగించే దిశగా జరిగే క్లినికల్‌ ట్రయల్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చింది.
04-06-2020
Jun 04, 2020, 05:56 IST
సెయింట్‌ జాన్స్‌: వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే మూడు టెస్టుల సిరీస్‌ కోసం తాము ఇంగ్లండ్‌లో పర్యటించబోమని వెస్టిండీస్‌ ఆటగాళ్లు...
04-06-2020
Jun 04, 2020, 04:56 IST
న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల విషయంలో పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దేశంలో వరుసగా నాలుగో రోజు 8 వేలకు...
04-06-2020
Jun 04, 2020, 04:44 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగు లక్షల మార్కును అధిగమించింది. మంగళవారం ఉదయం 9 గంటల...
04-06-2020
Jun 04, 2020, 04:33 IST
చైనాకు చెందిన ఎయిర్‌ చైనా, చైనా ఈస్ట్రర్స్‌ ఎయిర్‌లైన్స్, చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్, జియామెన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు తమ దేశంలో...
04-06-2020
Jun 04, 2020, 04:16 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కల్లోలంతో  ఏర్పడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలన్న అంశంపై...
04-06-2020
Jun 04, 2020, 03:49 IST
‘‘తలసానిగారితో నాది 30ఏళ్ల అనుబంధం. రాజకీయంగా ఆయన ఎదిగినా మాతో రిలేషన్‌ మాత్రం అలానే ఉంది. సినీ కార్మికులకు అండగా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top