ఆధారాల కోసం భారత్ కు పాక్ లేఖ | Pakistan asks India for more evidence on 26/11 Mumbai attacks | Sakshi
Sakshi News home page

ఆధారాల కోసం భారత్ కు పాక్ లేఖ

Jun 30 2016 7:22 PM | Updated on Sep 4 2017 3:49 AM

ఆధారాల కోసం భారత్ కు పాక్ లేఖ

ఆధారాల కోసం భారత్ కు పాక్ లేఖ

ఉగ్రవాద దాడుల కేసు దర్యాప్తులో పాకిస్థాన్ మరోసారి దాటవేత ధోరణి ప్రదర్శించింది.

ఇస్లామాబాద్: ఉగ్రవాద దాడుల కేసు దర్యాప్తులో పాకిస్థాన్ మరోసారి దాటవేత ధోరణి ప్రదర్శించింది. 26/11 ముంబై ముట్టడి కేసులో ఇప్పటికే భారత్ ఆధారాలు సమర్పించినా ఇంకా సాక్ష్యాలు కావాలని అంటోంది. ఈ కేసుకు సరైన పరిష్కారం దొరకాలంటే మరిన్ని ఆధారాలు సమర్పించాలని భారత్ ను కోరింది.

26/11 ముంబై దాడి కేసులో పాకిస్థాన్ ప్రమేయం ఉందని మోపిన అభియోగాలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని భారత్ కు తమ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌధురి లేఖ రాశారని విదేశాంగ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా వెల్లడించారు. ఈ కేసుకు సరైన ముగింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇస్లామాబాద్ ఉందని తెలిపారు. లేఖలోని మిగతా వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

2008, నవంబర్ లో ముంబై లో జరిగిన దాడులతో సంబంధముందన్న ఆరోపణలతో ఏడుగురు లష్కరే-ఇ-తోయిబా తీవ్రవాదులను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. వీరిలో ప్రధాన కుట్రదారుడు జకివుర్ రెహ్మాన్ ను బెయిల్ పై విడుదల చేసింది. మిగతా ఆరుగురు రావల్పిండి జైల్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement