తొలిదశ ఎన్నికల వేళ పాక్‌ అనూహ్య నిర్ణయం | Sakshi
Sakshi News home page

బాలాకోట్‌లో అంతర్జాతీయ మీడియా పర్యటన

Published Thu, Apr 11 2019 2:49 PM

Pakistan Allows Media To Visit Balakot - Sakshi

ఇస్లామాబాద్‌ : పుల్వామాలో భారత్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్ల మీద జరిగిన దాడికి ప్రతీకారంగా.. బాలాకోట్‌లోని జైషే ఉగ్ర స్థావరాలపై భారత్‌ వైమనిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని భారత్‌ ఆరోపిస్తుండగా.. పాక్‌ మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాక్‌ తొలిసారి భారత్‌ వైమానిక దాడులు జరిపిన బాలాకోట్‌ పరిసర ప్రాంతంలో సందర్శించడానికి అంతర్జాతీయ మీడియాను అనుమతించింది. భారత్‌ వైమనిక దాడి చేసిన 43 రోజుల తర్వాత.. భారత్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు పాక్‌ ఈ పర్యటనకు అనుమతించడం పట్లా సర్వత్రా ఉత్కంఠతకు తెర తీసింది.

పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన వ్యక్తులతో పాటు.. వివిధ దేశాల దౌత్యవేత్తలు.. భద్రతా బలగాలకు చెందిన దాదాపు 24 మంది పర్యటనలో పాల్గొన్నారని సమాచారం. పాక్‌ అధికారులు వీరందరిని దాడి జరిగినట్లుగా చెప్పబడుతున్న ప్రాంతానికి తీసుకెళ్లారు. భారత వైమానకి దళం దాడి జరపిన ప్రాంతం ఉగ్రవాద శిబిరం కాదని.. అది ఒక మదర్సా అని పాక్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ మదర్సాలో దాదాపు 130 దాకా విద్యార్థులున్నట్లు సమాచారం. అంతేకాక ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపింది.

ఈ నేపథ్యంలో పాక్‌ ఆర్మీ అధికారి ఒకరు.. ‘అంతర్జాతీయ మీడియాతో పాటు భారత్‌కు చెందిన జర్నలిస్టులు.. దౌత్యవేత్తలు, భద్రతా సిబ్బంది బాలాకోట్‌ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం ఇక్కడ దాడులకు పాల్పడింది. భారత్‌ చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఎలాంటి ఉగ్ర సంస్థలు లేవు. భారత్‌ నియమాలను ఉల్లఘించి వైమానిక దాడి జరిపింది ఓ మదర్సా మీద. వాస్తవ పరిస్థితులను తెలుసుకొండి. భారత్‌ చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి’ అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement