మరో గౌరవం కోల్పోయిన సూచీ

Oxford college drops Aung San Suu Kyi from common room's name

లండన్‌: మయన్మార్‌లో రోహింగ్యాల సమస్య కారణంగా ఆంగ్‌సాన్‌ సూచీ మరో గౌరవాన్ని కోల్పోయారు. సుప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కాలేజ్‌లో ‘జూనియర్‌ కామన్‌ రూమ్‌’ నుంచి ఆమె పేరును తొలగించారు. స్వదేశంలో రోహింగ్యాలపై జరుగుతున్న అకృత్యాలకు సంబంధించి ఆమె నిస్సహాయంగా ఉన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇందుకు సంబంధించి సెయింట్‌ హ్యూస్‌ విద్యార్థులు సూచీ పేరును జూనియర్‌ కామన్‌ రూమ్‌ నుంచి తక్షణమే తొలగించడానికి అనుకూలంగా ఓటేశారు. ‘రాఖైన్‌లో రోహింగ్యాలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలను సూచీ ఖండించకపోవడం శోచనీయం. సూచీ మౌనాన్ని ఖండిస్తున్నాం’ అని  విద్యార్థులు తీర్మానంలో పేర్కొన్నారు. సెయింట్‌ హ్యూస్‌ కాలేజీ ప్రవేశ ద్వారం నుంచి సూచీ ఫొటోను ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top