breaking news
Suu Kyi
-
సూకీకి 5 లక్షల డాలర్లు లంచమిచ్చా
మాండలే: మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అధికారపగ్గాలు చేపట్టిన సైనిక పాలకులు, ఆ దేశ నేత అంగ్‌సాన్ సూకీపై మరింత ఒత్తిడి పెంచారు. అంగ్‌సాన్ సూకీకి 5 లక్షల డాలర్లకు పైగా అందజేసినట్లు సైనిక జుంటా అనుకూల నిర్మాణ సంస్థ యజమాని మౌంగ్ వైక్ ఆరోపించారు. గతంలో డ్రగ్స్ అక్రమ తరలింపు కేసులున్న వైక్ గురువారం ప్రభుత్వ ఆధీనంలోని టీవీలో ఈ మేరకు ప్రకటించారు. సూకీ తల్లి పేరిట ఉన్న చారిటబుల్ ట్రస్టుకు 2018 నుంచి వివిధ సందర్భాల్లో మొత్తం 5.50 లక్షల డాలర్లను అందజేసినట్లు తెలిపారు. అప్పటి ప్రభుత్వంలోని మంత్రులు తన వ్యాపారానికి అనుకూలంగా ఉండేందుకు కొంత మొత్తాన్ని ఇచ్చినట్లు చెప్పుకున్నారు. నిర్బంధంలో ఉన్న సూకీపై సైనిక పాలకులు ఇప్పటికే పలు ఆరోపణలు మోపిన విషయం తెలిసిందే. వాకీటాకీలను అక్రమంగా కలిగి ఉండటం, ఒక రాజకీయ నేత నుంచి 6 లక్షల డాలర్ల విలువైన బంగారాన్ని తీసుకోవడం వంటివి వీటిలో ఉన్నాయి. సూకీతోపాటు నిర్బంధం అనుభ విస్తున్న దేశాధ్యక్షుడు విన్ మింట్‌పై కూడా దేశంలో అశాంతికి కారకుడయ్యారంటూ ఆరోపణలు మోపారు. ఫిబ్రవరి ఒకటో తేదీన అధికారాన్ని హస్త గతం చేసుకున్న సైనిక పాలకులు ప్రజాస్వామ్యం కోసం ప్రజలు తెలుపుతున్న నిరసనలను ఒక వైపు ఉక్కుపాదంతో అణచివేస్తూనే.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన పాలకులను నిర్బంధించి, పలు ఆరోపణలు మోపి విచారణకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా, ఐక్యరాజ్యసమితిలో ప్రజాస్వామ్యా నికి అనుకూలంగా మాట్లాడిన ఆ దేశ రాయబారి క్యామోటున్‌పై సైనిక జుంటా దేశ ద్రోహ నేరం మోపింది. అజ్ఞాతంలో ఉన్న ప్రజానేత మహ్‌న్ విన్ ఖయింగ్ థాన్‌పైనా దేశద్రోహం మోపింది. గురువారం యాంగూన్ శివారు ధామైన్‌లో ఆందోళనలు చేపట్టిన ప్రజలు పోలీసులకు రాకను అడ్డుకునేందుకు రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి, వాటికి నిప్పంటించారు. -
విప్లవ ‘నారీ’.....విజయ భేరీ
"నాటి స్వాతంత్ర్య పోరాటం మొదలు.....నేటి ‘‘మీ టూ’’(లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా) వచ్చిన ఉద్యమాలు, పోరాటాలు కోకొల్లలు. వీటిల్లో స్త్రీలు సారధ్యం వహించినవి, వహిస్తున్నవి ఎన్నో.....సమాజ గతిని మార్చిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన నారీమణులెందరో. వారిలో నేడు కొందరిని స్మరించుకుందాం ......’’ లక్ష్మి సెహగల్ కెప్టెన్ లక్ష్మిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మి సెహగల్ అజాద్ స్థాపించిన ‘‘నేషనల్ ఆర్మి’’లో పనిచేసిన ఏకైక మహిళ. తదనంతరం ఆజాద్ స్థాపించిన హిందూ గవర్నెమెంటులో మహిళా మంత్రిత్వ శాఖను నిర్వహించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో రాణి ఝాన్సీ దళానికి నాయకత్వం వహించారు. ఈ దళం ప్రత్యేకత దీనిలోని సభ్యులందరూ మహిళలే. వీరు రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఆంగ్ సాన్ సూ చీ తండ్రి స్వాతంత్ర్యం కోసం పోరాడి హత్యకు గురైన గొప్ప యోధుడు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది ఆంగ్ సాన్ సు కీ. 1988 వరకూ కూడా ఆమె తన జీవితాన్ని భారత్, అమెరికా, జపాన్, ఇంగాండ్ దేశాల్లోనే గడిపింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూసుకోవడానికి బర్మాకి తిరిగి వచ్చింది. ఆమె దేశంలో అడుగుపెట్టె సమయానికి ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అధికార పార్టీ తప్పుడు నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. అందుకు నిరసనగా వీధుల్లో ఆందోళన చేస్తున్న ప్రజల మీద ఆర్మి కాల్పులు జరిపింది. ఈ సంఘటనతో ప్రభావితురాలైన సూ చీ ప్రజా ఉద్యమంలో తాను భాగస్వామ్యం కావాలని భావించింది. 1989లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీని స్థాపించింది. ఒక్క సంవత్సర కాలంలోనే అంటే 1990లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సూ కీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది. కానీ సైనిక బలగాలు మాత్రం సూ చీ కి అధికారాన్ని ఇవ్వడానికి నిరాకరించాయి. ఆమెను నిర్భంధంలో ఉంచాయి. కానీ సూ చీ మాత్రం విశ్వసాన్ని కోల్పోలేదు. సైన్యంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆమె చర్చలు ఫలించి, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాల మద్దతు వల్ల 15 సంవత్సరాల తర్వాత ఆమెను నవంబర్,2010లో నిర్భంధం నుంచి విముక్తి చేసింది సైన్యం. 2015లో జరిగిన ఎన్నికల్లో సూ చీ పార్టీ ఘన విజయం సాధించింది. బర్మా ప్రజలు దేవతగా కొలిచే ఆంగ్ సాన్ సూ చీ 1991లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. తవాకెల్ కర్మన్ అరబ్ దేశాలు అంటేనే విపరీతమైన ఆంక్షలు, కట్టుబాట్లు. స్త్రీ స్వాతంత్ర్యం గురించి ఆలోచించడం కాదు కదా కనీసం ఆలోచించడానికి కూడా ఎవరూ ధైర్యం చేయరు. అక్కడ ఆడవాళ్లు ఎల్లప్పుడు ముసుగు వేనకే ఉండాలి. చదువుకోవడం మాట దేవుడేరుగు ఇంట్లోనుంచి బయటకు రావాలన్న ఎవరో ఒకరు తొడుగా రావల్సిందే. అలాంటి సమాజంలో ఆ కట్టుబాట్లను ఎదిరించి నిలిచింది తవాక్కల్ కర్మాన్. ఉక్కు మహిళ, విప్లవ మాత గా యెమెన్ ప్రజల చేత పిలవబడుతున్న తవాక్కల్ నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి అరబ్ దేశ వనిత...రెండో ముస్లీం మహిళ(నోబెల్ అందుకున్న తొలి ముస్లీం బాలిక మలాల యూసఫ్ జాయ్). యెమెన్‌లో మానవహక్కుల రక్షణ కోసం 2005లో 7గురు మహిళా విలేకరులతో కలిసి సంకెళ్లు లేని మహిళా విలేకరులు అనే సంస్థను స్ధాపించి వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. కోరజోన్ అక్వినో సాధరణ గృహిణి స్థాయి నుంచి ఫిలిప్పైన్స్ కే కాక మొత్తం ఆసియాలోనే తొలి మహిళా ప్రధానిగా నిలిచిన కోరజోన్ అక్వినో జీవిత గమనం ఎంతో స్ఫూర్తిదాయకం. తన భర్త బెనిగ్నొ ఆక్వినో జూ. నాటి ప్రధాని మార్కొస్కు బద్ద వ్యతిరేకి కావటంతో అతన్ని దేశబహిష్కరణ చేశారు. అమెరిక ప్రవాసం వెళ్లిన అతన్ని హత్య చేయడంతో కోరజోన్ ఫిలిప్పైన్స్కు తిరిగి వచ్చి మధ్యంతర ఎన్నికల్లో పోటిచేశారు. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ఆమె రెండు వారాల పాటు శాంతియుతంగా పోరాడి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఆమెకు వ్యతిరేకంగా ఎన్నో తిరుగుబాట్లు జరినప్పటికీ ప్రజాస్వామ్య పరంగా గణనీయమైన అభివృద్ధిని సాధించారు. అధ్యక్షుని అధికారాలను పరిమితం చేసే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. 1992లో పదవి విరమణ చేసిన తర్వాత కూడా ప్రజాస్వామ్యానికి హాని కల్గించే విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆమె చేసిన సేవలకు గాను 1998లో ‘‘రామన్ మెగాసెసె’’ అవార్డును పొందారు. గోల్డా మేయర్ పాలస్తినాను విభజించి ఇజ్రాయేల్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి ఆందోళనలు జరిగాయి. చివరకూ ఐక్యరాజ్య సమితి కూడా 1947లో పాలస్తినాను విభజన ప్రతిపాదనను చేసింది. కానీ అరబ్బు దేశాలు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకింయి. ఆ సమయంలో ఇజ్రాయేల్ ఏర్పాటు కోసం జియోనిస్ట్ ఉద్యమం ప్రారంభయ్యింది.ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు గోల్డా మేయర్. ఒకానొక సందర్భంలో ఉద్యమంలోని కీలక నేతలందరూ అరెస్టు అయినప్పుడు గోల్డా మేయరే ఉద్యమకారుల తరుపున అధికారులతో సంప్రదింపులు జరిపి, 1948లో ఇజ్రాయేల్ ఏర్పడడానికి ఎంతో కారణమయ్యారు. నూతన ప్రభుత్వంలో డేవిడ్ బెన్ గురియన్ మంత్రి వర్గంలో పనిచేసారు. అంచెలంచెలుగా ఎదిగి 1973లో ఇజ్రాయేల్ ప్రధాని అయ్యారు. విల్మా లుసిలా ఎస్పిన్ చరిత్రలో క్యూబా విప్లవానిది ఓ ప్రత్యేక స్థానం. ఈ విప్లవం గురించి తలుచుకోగానే అందరికి గుర్తుకు వచ్చేది చేగువేరా, ఫిడెల్‌క్యాస్ట్రో, లాటిన్ ఎల్టైస్.....కారణం వీరంతా ప్రజా నాడి తెలిసిన వారు. కానీ ఈ విప్లవంలో కీలక పాత్ర పోషించిన ఓ మహిళ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఆమె ‘విల్మా లుసిలా ఎస్పిన్’. కెమికల్ ఇంజనీర్ చదివిన విల్మా 1950లో బటిస్టా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమంలో ఆయుధాలు ధరించి సాధరణ కరేబియన్ స్త్రీల ఆహర్యానికి వ్యతిరేకంగా నిత్యం ఆర్మి దుస్తులు ధరించి ఉండేవారు. తదనంతరం ఫిడెల్ క్యాస్ట్రో సోదరుడు రఫెల్‌ను వివాహం చేసుకున్నారు. జానెట్ జగాన్ చికాగోలో జన్మించిన జానెట్ ప్రేమించిన వాడి కోసం స్వదేశాన్ని వదిలి గయానా వచ్చారు. ఒక చిన్న షాపు యజమానిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి గయానాకు తొలి మహిళ ప్రధాని అయ్యారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గయానాలో రోజువారి కూలీలు ప్రారంభించిన ఉద్యమంలో జానెట్ కీలక పాత్ర పోషించి అప్పటి బ్రిటన్ ప్రధాని వినస్టన్ చర్చిల్ ఆగ్రహానికి గురయ్యారు. ఆమెను నాయకత్వం నుంచి వేరు చేయడానికి చేసిన ప్రయత్నాలు అన్ని వ్యర్థమయ్యాయి. చివరకు బ్రిటన్ నుంచి గయానాకు స్వతంత్రం లభించింది. 1997లో గయాని ప్రధాని అయ్యాక దేశ సంపదలో అత్యధిక భాగాన్ని జాతీయం చేశారు. జియాంగ్ క్వింగ్ మావో జెడాంగ్ భార్యగా అందరికి పరిచితమైన జియాంగ్ జీవితంలో రెండు పార్శ్వాలు ఉన్నాయి. మొదటి భాగంలో ఆమె అనుభవించిన పేదరికం, నటిగా వైఫల్యాలు ఉంటే, రెండో భాగంలో సాంస్కృతిక విప్లవంలో భాగంగా తీవ్ర వ్విధ్వంసానికి పాల్పడిన కమ్యూనిస్టు సభ్యురాలిగా అన్నింటికి మించి పశ్చాత్తాపమంటే తేలియని క్రూరమైన విప్లవకారినిగా ఆధునిక చరిత్రలో నిలిచిపోయారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే తీవ్రవాదులకు నాయకురాలిగా ఎదిగారు. మావోను వివాహం చేసుకున్న అనంతరం సాంస్కృతిక విప్లవంలో ఎక్కువగా నిమగ్నమయ్యారు. తనకు తానే ‘‘నేను మావో పపెంపుడు కుక్కను, అతడు ఎవరిని కరవమంటే వారిని కరుస్తాను’’ అని చెప్పుకునేవారు. ఒక దశాబ్దం పాటు జైలు జీవితం గడిపిన తరువాత 1991లో ఆత్మహత్య చేసుకున్నారు. నాదెజ్డా క్రుప్స్కాయా 1917లో ‘అక్టోబర్ విప్లవం’ రావడానికి ప్రధాన కారకులయిన నాదెజ్డా క్రుప్స్కాయాకి చిన్నతనం నుంచే అన్యాయాన్ని ఎదదిరించడం అలవాటు. పేద, ధనిక తారతమ్యాలను అసహ్యించుకునేవారు. అందరూ చదువుకోవాలి, అందరూ ఎదగాలని కోరుకునేవారు. తాను చదువుకుంటునే సాయంత్రం సమయంలో పారిశ్రామిక కార్మికులకు చదువుచెప్పేవారు నాదెజ్డా క్రుప్స్కాయా. ఆ సమయంలోను మార్క్సిజం పట్ట ఆకర్షితురాలయ్యారు. వాద్లిమర్ లెనిన్తో కలిసి 1895లో ‘‘లీగ్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ది ఎమోన్సిపేషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ ’’ను స్థాపించారు. అనంతరం లెనిన్‌ను వివాహం చేసుకున్నారు. పోలీసులు ఈ జంటను సైబిరియాకు ప్రవాసం పంసారు. మార్క్సిస్టులకోసం ‘‘ఇస్క్రా’’ అనే పతత్రికను నడిపారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రష్యా వెళ్లారు. బోల్షివిక్ పార్టీని స్థాపించారు. తన జీవితాంతం వరకూ కార్మికుల సంక్షేమం కోసం తపించారు. సుసాన్ బి ఆంటోని ‘‘ఆడపిల్లకు పెద్ద చదువులెందుకు ఊళ్లేలా, ఉద్యోగాలు చేయలా....బస్పు బోర్డు చదవడం తెలిస్తే చాలు’’....ఇప్పటికి వినిపించే మాట. అలాంటిది మరి 18వ శతాబ్దంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు సుసాన్. ఆమె చదువుకుంటున్న పాఠశాలలో ఒక మగ ఉపాధ్యాయుడు సుసాన్‌తో ‘‘నీకు ఇంక పెద్ద చదువులు అక్కరలేదు. ఒక ఆడపిల్లకు బైబిల్ చదవడం,తన వయసు లెక్కించుకోవడం తెలిస్తే సరపోతుంది’’ అన్నారు. ఆ మాటలు ఆమెలో బలంగా నాటుకుపోయాయి. పట్టుదలతో చదివి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలి స్థాయికి ఎదిగారు. స్త్రీల హక్కుల కోసం ‘‘ది రివల్యూషన్’’ అనే పత్రికను స్థాపించారు. ‘‘నేషనల్ ఉమెన్ సర్ఫెజ్ అసోసియేషన్’’ను స్థాపించి స్త్రీలకు ఓటు హక్కు కోసం పోరాటం చేసారు. ఆమె చేసిన కృష ఫలితంగా అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కల్పించారు. ఎమ్మిలైన్ పాంక్రస్ట్ మహిళలకు ఓటుహక్కు కల్పించడం కోసం పోరాడిన మరొక మహిళ ఎమ్మిలైన్ పాంక్రస్ట్. తన తండ్రి ప్రోత్సాహంతో లా చదివిన ఎమ్మిలైన్ మహిళల హక్కుల కోసం పోరడ్డానికి ‘‘వుమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్’’ను స్థాపించారు. దాని ప్రధాన ఉద్దేశం ‘‘మాటలు కాదు చేతలు’’. ఫలితంగా ఆమెను 12సార్లు అరెస్టు చేశారు. ఆమె చేసిన కృషికిగాను బ్రిటన్ ప్రభుత్వం ఆమె మరణించిన సంవత్పరంలోనే(1928)లో మహిళలకు ఓటు హక్కు కల్పించింది. ఆమె తీసుకొచ్చిన సంస్కరణలు నేటికి ఆచరణలో కొనసాగుతున్నాయి. హరియత్ టబ్మాన్ ‘‘నా ముందు రెండు అంశాలున్నాయి- స్వేచ్ఛ, మరణం. ఒకటి లేకపోతే మరొకటి ఉంటుంది’ ఈ వాక్యాలు చేప్పింది హరియత్ టబ్మాన్. 1820లో మేరీలాండ్‌లో ఒక బానిస కుటుంబంలో జన్మించిన హరియత్ టబ్మాన్ స్వేచ్ఛ కోసం స్వతంత్ర రాష్ట్రం పెన్నిసులేనియా వెళ్లారు. ఒక సంవత్పరం తర్వాత మేరీలాండ్ తిరిగి వచ్చి తన కుటుంబంతో పాటు, భూగర్భ రైలు రోడ్డు నిర్మాణంలో పనిచేస్తున్న మరో 300మంది బానిసలను కాపాడారు. సైనిక దండయాత్రను ఎదుర్కొన్న తొలి మహిళ హరియత్ టబ్మాన్ చరిత్రలో నిలిచిపోయారు. మేరి వొల్‌స్టోన్‌క్రాఫ్ట్ అనాదిగా వస్తున్న ఈ పురుషాధిక్య సమాజంలో 18వ శతాబ్దంలోనే మహిళల హక్కుల కోసం పపోరాడిన వ్యక్తి మేరి వొల్‌స్టోన్‌క్రాఫ్ట్. ‘‘ఆస్తుల కంటే ఆడవారు గొప్పవారు’’ అని ప్రచారం చేశారు. ‘‘ఏ విండికేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద మెన్’’(1790), ‘‘ఏ విండికేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద వుమెన్’’(1791) ఆమె చేసిన రెండు గొప్ప రచనలు. మహిళల హక్కుల కోసం తన గొంతును బలంగా వినిపించారరు. కాన్స్టాన్స్ మార్కీవిగ్స్ కాన్స్టాన్స్ మార్కీవిగ్స్ ఆంగ్లో-ఐరీష్ వనిత. ఒక ప్రఖ్యాత విప్లవకారిణి, జాతీయవాది, సోషలిస్టు కూడా. ఐరీష్ స్వతంత్రం కోసం పోరాడారు. ఐరీస్ క్యాబినేట్లో తొలి మహిళా మంత్రి అంతేకాదు బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్‌కు ఎన్నికయిన తొలి మహిళ కూడా కాన్స్టాన్స్ మార్కీవిగ్సే. పెట్రా హెర్రార మెక్సికో విప్లవం సందర్భంగా స్త్రీలు కూడా పురుషులతో పాటు పోరాటం చేయడానికి వెళ్లేవారు. కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, కనీస గుర్తింపుకు కూడా నోచుకోలేదు. పురుషులతో సమానంగా పేరు తెచ్చుకున్న పెట్రా హెర్రార ను పపెడ్రో హెర్రార గా పిలిచేవారు. ఈ అసమానతను తట్టుకోలేక సైన్యం నుంచి బయటకు వచ్చి తానే స్వయంగా 400మంది మహిళలతో ఒక దళాన్ని ఏర్పాటుచేశారు. 1914, మే 30న జరిగిన టోరియన్ యుద్దంలో పాల్గొన్నారు. న్వాన్యెరువా మహామహా సామ్రాజ్యాలను తమ పాదక్రాంతం చేసుకున్న బ్రిటిష్ వారు ఆడవారి ముందు తలవంచారు, న్యాయపరమైన వారి హక్కులను గుర్తించారు. ఆశ్చర్యం గొలిపే ఈ సంఘటన నైజీరియాలో జరిగింది. ఆడవారి ని సైతం పన్నులు చెల్లించమని ఒత్తిడి చేస్తున్న బ్రిటిష్ అధికారులను తన తోటి మహిళలతొ కలిసి ఎదిరించారు నైజీరియాకు చెందిన న్వాన్యెరువా. 25,000వేల మంది మహిళలను సంఘటిత పరిచి పన్ను వసూళ్లకు వ్యతిరేకంగా రెండునెలల పాటు నిరసనలు కొనసాగించారు. చివరకూ ప్రభుత్వం దిగివచ్చి వారిమీద విధించిన పన్నులను రద్దు చేసింది. సోఫి స్కూల్ యూదుల మీద హిట్లర్ జరిపిన మారణకాండనను తలుచుకుంటే నేటికి ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి నియంతకు, ఆయన జరిపే హింసాకాండకు వ్యతిరేకంగా ప్రారంభమైంది ‘వైట్ రోజ్’ ఉద్యమం. దీని పని హిట్లర్ పాలనకు వ్యతిరేకంగా అహింసా పద్దతిలో కరపత్రాలను పంచడం, గోడలమీద వ్యతిరేక రాతలు రాయడం. ఇదంతా చాలా రహస్యంగా జరిగేది. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు సోఫి స్కూల్. ఆమె తన సహచరులతో కలిసి మ్యూనీచ్ విశ్వవిద్యాలయం దగ్గర కరపత్రాలను పంచుతుండగా ఆమెను బంధించారు. అనంతరం అతి క్రూరంగా ఆమె తలను నరికి చంపేశారు. ఆమెను చంపేశారు కానీ ఆమె ఆశయాన్ని మాత్ర చంపలేక పోయారు. సెలియా సాంచెజ్ క్యూబా విప్లవం అనగానే మనందరికి వెంటనే గుర్తుకు వచ్చేది ఫిడేల్ క్యాస్ట్రో, చేగువేరా. విప్లవానికి ఆధారంగా నిలిచిన సెలియా సాంచెజ్ గురించి అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. 1952 తిరుగుబాటు తర్వాత బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభమైన తిరుగుబాటులో చేరారు సెలియా సాంచెజ్. చరిత్రకెక్కిన జూలై 26 ఉద్యమనానికి స్థాపకురాలైనిరు. విప్లవం ముగిసేంతవరకూ దళాలకు నాయకత్వం వహించారు. బటిస్టా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడ్డానికి మెక్సికో నుంచి క్యూబాకు వచ్చిన 82 మంది సైనికులకు కావలసిన సదుపాయలను కల్పించారు. విప్లవం ముగిసిన నాటి నుంచి చనిపోయే వరకూ క్యాస్ట్రోకు ఆప్తురాలిగా మెలిగారు. అస్మా మహఫౌజ్ ఆధునిక విప్లవకారిణి. 2011 ఈజిప్టు విప్లవంలో కీలక పాత్ర పోషించారు. తహరీర్ స్క్వేర్ వద్ద ప్రదర్శించే నిరసనలో తనతోపాటు పాల్గొనడానికి మిగితా వారిని ప్రోత్సాహించడానికి తన బ్లాగులో ఒక వీడియోను పోస్టు చేసారు. అది ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. ‘‘ఈజిప్టు కోయిలేషన్ ఆఫ్ ద యూత్ ఆఫ్ ద రివల్యూషన్’’లో తాను ప్రముఖ సభ్యురాలు. లైమా రాబోర్ట గబోయి లైబిరియాకు చెందిన ప్రముఖ శాంతి కార్యకర్త. లైబిరియాలో శాంతి స్థాపన కోసం ప్రారంభమైన ‘‘వుమెన్ ఆఫ్ లైబిరియన్ ఫర్ మాస్ యాక్షన్ ఆఫ్ పీస్’’ అనే శాంతి ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఆమె కృషి ఫలితంగా 2003లో రెండవ లైబిరియన్ పౌర యుద్ధం ముగిసింది, 2005లో నిర్వహించిన ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగాయి. ఆమె చేసిన సేవలకు గాను 2011లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. పూలన్ దేవి బాధించేవారు ఎప్పుడు ఉన్నత వర్గం వారే, బాధితులేప్పుడు అల్పులే. ఎందుకంటే వారి తరపున నిలబడే వారు ఎవ్వరు ఉండరు. తిరగబటడం వారికి చేతకాదు. ఒకవేళ వారే కనక ఎదురుదాడి చేస్తే.....సరిగ్గా అదే జరిగింది పూలన్ దేవి విషయంలో. ఉత్తరప్రదేశ్‌లోని ఓ నిమ్న వర్గంలో పేద కుటుంబంలో పుట్టింది పూలన్ దేవి. చిన్నప్పటి నుంచే ఎన్నో బాధలు పడింది, ఉన్నత వర్గం వారి చేతిలో అనేక మార్లు లైంగిక హింసకు గురయ్యింది. వైవాహిక జీవితం తాను కోరుకున్న మార్పును ఇవ్వలేదు. దాంతో ఇంటి నుంచి పారిపోయి బందిపోట్లతో కలిసిపోయారు. తనకు అన్యాయం చేసిన 20మంది ఉన్నత వర్గం వారిని అదే గ్రామంలో నిలబెట్టి కాల్చి చంపారు. పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి జైలునుంచి విడుదలయ్యారు. తర్వాత సమాజ్‌వాది పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. పేదలు, అణగారిన వర్గాల వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా నిలిచిపోయారు పూలన్ దేవి. - పిల్లి ధరణి -
మరో గౌరవం కోల్పోయిన సూచీ
లండన్: మయన్మార్‌లో రోహింగ్యాల సమస్య కారణంగా ఆంగ్‌సాన్ సూచీ మరో గౌరవాన్ని కోల్పోయారు. సుప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాలేజ్‌లో ‘జూనియర్ కామన్ రూమ్’ నుంచి ఆమె పేరును తొలగించారు. స్వదేశంలో రోహింగ్యాలపై జరుగుతున్న అకృత్యాలకు సంబంధించి ఆమె నిస్సహాయంగా ఉన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సెయింట్ హ్యూస్ విద్యార్థులు సూచీ పేరును జూనియర్ కామన్ రూమ్ నుంచి తక్షణమే తొలగించడానికి అనుకూలంగా ఓటేశారు. ‘రాఖైన్‌లో రోహింగ్యాలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలను సూచీ ఖండించకపోవడం శోచనీయం. సూచీ మౌనాన్ని ఖండిస్తున్నాం’ అని విద్యార్థులు తీర్మానంలో పేర్కొన్నారు. సెయింట్ హ్యూస్ కాలేజీ ప్రవేశ ద్వారం నుంచి సూచీ ఫొటోను ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. -
మయన్మార్‌కు అండగా ఉంటాం
-
మయన్మార్ ఎన్నికల్లో సూచీ విజయం
అంతర్జాతీయం పారిస్ ఉగ్రదాడిలో 128 మంది మృతి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నవంబర్ 14న ఉగ్రవాదులు జరిపిన దాడులలో 128 మంది పౌరులు మరణించగా, మరో 300 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు పారిస్‌లోని ఏడుచోట్ల విచక్షణారహిత దాడులకు పాల్పడ్డారు. పారిస్ అంతర్జాతీయ స్టేడియం, బతాక్లాన్ థియేటర్‌తో పాటు కెఫేలపై బాంబులు, తుపాకులతో దాడిచేసి పౌరులను హతమార్చారు. ఉగ్రవాదుల్లో కొందరిని భద్రతా దళాలు కాల్చి చంపగా, మరికొందరు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. సిరియాలో దాడులకు ప్రతీకారంగానే పారిస్ దాడులకు పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ప్రకటించింది. ఈ దాడిని ఫ్రాన్స్ అధ్యక్షుడు తమ దేశంపై జరిగిన యుద్ధంగా అభివర్ణించారు. అంతర్జాతీయ సమాజం పారిస్ దాడులను తీవ్రంగా ఖండించింది. ఆంటిల్యాలో జీ-20 సదస్సు రెండు రోజుల జీ-20 సదస్సు ఆంటిల్యా (టర్కీ)లో నవంబర్ 15న ప్రారంభమైంది. సదస్సులో దేశాధినేతలు ప్రధానంగా ఉగ్రవాదంపై చర్చించారు. పారిస్ ఐఎస్ఐఎస్ దాడుల నేఫథ్యంలో సదస్సులో ఉగ్రవాద సమస్య ప్రధానాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్రమోదీలు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, సుస్థిర వృద్ధి, ఇంధనం, వాతావరణ మార్పు, శరణార్థుల సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వీటితో పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో కోటా సంస్కరణలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఓటుహక్కు కల్పించడం వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకొచ్చాయి. బ్రిటన్‌తో పౌరఅణు సహకార ఒప్పందం భారత ప్రధాని నరేంద్రమోదీ బ్రిటన్ పర్యటనలో భాగంగా నవంబర్ 12న ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి కామెరూన్ మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో ఇరు దేశాలు పౌర అణుసహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఉగ్రవాదాన్ని ప్రపంచమంతా కలిసి అణిచి వేయాలని పిలుపునిచ్చారు. బ్రిటన్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. బ్రిటీష్, భారత కంపెనీల మధ్య రూ.90,500 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, సైబర్ సెక్యూరిటీలలో పరస్పరం సహకరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 ఏర్పాటు చేసిన విందులో పాల్గొనడంతో పాటు వెంబ్లీ స్టేడియంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. మయన్మార్ ఎన్నికల్లో సూచీ విజయం మయన్మార్‌లో తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూచీ ఘన విజయం సాధించారు. నవంబర్ 8న పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) 80 శాతం స్థానాలను కైవసం చేసుకొంది. మొత్తం 664 స్థానాలకు గాను 440 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన స్థానాలను సైన్యం తనకు కేటాయించుకొంది. భర్త, పిల్లలు విదేశాల్లో పుట్టడంతో సూచీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హురాలిగా ఆ దేశ నిబంధనలు ఉన్నాయి. రాష్ట్రీయం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన గుంటూరు సమీపంలోని లాం వద్ద ఏర్పాటు చేస్తున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి రాధామోహన్ సింగ్ నవంబర్ 16న శంకుస్థాపన చేశారు. 500 ఎకరాల్లో నిర్మించే ఈ విశ్వవిద్యాలయం కోసం రానున్న ఐదేళ్లలో రూ.1505 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. అనురాగ్‌శర్మకు పూర్తిస్థాయి డీజీపీ బాధ్యతలు సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్‌శర్మను తెలంగాణ రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నవంబర్ 13న నిర్ణయం తీసుకొంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అనురాగ్‌శర్మ ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్నారు. క్రీడలు రోస్బర్గ్కు బ్రెజిల్ గ్రాండ్ ప్రి టైటిల్ బ్రెజిల్ ఫార్ములావన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ రోస్‌బర్గ్ గెలుచుకొన్నాడు. నవంబర్ 16న జరిగిన రేసులో రోస్‌బర్గ్ మొదటి స్థానం దక్కించుకోగా, మరో మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ హైదరాబాద్‌కు చెందిన శ్రీసాయి సిరిల్‌వర్మ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజిత పతకం సాధించాడు. దీంతో బాలుర సింగిల్స్‌లో రజిత పతకం సాధించిన వ్యక్తిగా సిరిల్‌వర్మ రికార్డుకెక్కాడు. చైనా ఓపెన్ విజేతగా లీ జురుయ్ చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను లీ జురుయ్ (చైనా) గెలుచుకొంది. నవంబర్ 15న జరిగిన ఫైనల్లో భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్‌ను జురుయ్ ఓడించింది. దీంతో సైనా రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వార్న్ వారియర్స్‌కు ఆల్‌స్టార్స్ సిరీస్ క్రికెట్ టీ-ట్వంటీ ఆల్‌స్టార్స్ సిరీస్‌ను వార్న్ వారియర్స్ గెలుచుకొంది. వార్న్ వారియర్స్ టీం నవంబర్ 15న లాస్ఏంజెల్స్లో జరిగిన మూడో టీ-ట్వంటీ మ్యాచ్‌లో సచిన్ బ్లాస్టర్స్ టీంను ఓడించి 3-0 తో సిరీస్‌ను సొంతం చేసుకొంది. జాతీయం అమల్లోకి స్వచ్ఛ భారత్ సుంకం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సేవా సుంకాన్ని విధించింది. ఇది నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో అర్హమైన అన్ని రకాల సేవలపై 0.5 సుంకాన్ని విధిస్తారు. ఇప్పటికే విధిస్తున్న 14 శాతం సేవాపన్నుకు అదనంగా ఈ సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తాజా నిర్ణయంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అదనంగా నాలుగు వేల కోట్ల రూపాయలు సమకూరే అవకాశం ఉంది. 15 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలు సడలింపు 15 కీలక రంగాలకు సంబంధించి...విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను కేంద్రం సవరించింది. ఈ మేరకు కేంద్రం నవంబర్ 10న నిర్ణయం తీసుకొంది. దీంతో పాటు ఎఫ్‌డీఐలకు అనుమతి ప్రక్రియను సరళతరం చేసింది. డీటీహెచ్, కేబుల్ నెట్వర్క్, తోటపంటల సాగులో 100 శాతం, న్యూస్, కరెంట్ అఫైర్స్, టీవీ చానెళ్లు, రక్షణ రంగంలో 49 శాతం, నిర్మాణ రంగంలో పూర్తై ప్రాజెక్టుల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రాంతీయ ఎయిర్ సర్వీసుల్లో 49 శాతం మేర ఎఫ్‌డీఐలకు ఆటోమేటిక్‌గా అనుమతి మంజూరు చేయనున్నారు. రూ.5000 కోట్ల పరిధి వరకు ఎఫ్‌డీఐలకు అనుమతి మంజూరు చేసే అధికారాన్ని విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డుకు కల్పించారు. గతంలో బోర్డుకు రూ.3,000 కోట్లు వరకే నిర్ణయాధికారం ఉండేది. అత్యుత్తమ 100 యూనివర్సిటీల్లో బెంగళూరు ఐఐఎస్సీ ప్రపంచంలోని 100 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలకు సంబంధించి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్‌లలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) స్థానం దక్కించుకొంది. ఈ జాబితాలో ఐఐఎస్సీ తొలిసారిగా 99వ స్థానంలో నిలిచింది. లండన్‌కు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నవంబర్ 12న ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో అత్యుత్తమ సంస్థల జాబితాను విడుదల చేసింది. ఇందులో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్, కాల్టెక్, మసాచుసెట్స్ యూనివర్సిటీలు(మిట్) వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచాయి. సైన్స అండ్ టెక్నాలజీ జీశాట్-15 ప్రయోగం విజయవంతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీశాట్-15 ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నవంబర్ 11న ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అరైన్-5 వీకే 227 ఉపగ్రహ వాహక నౌక ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. జీశాట్-15తో పాటు అరబ్శాట్ను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టారు. జీశాట్-15లో 24 కేయూ బ్యాంక్ ట్రాన్స్‌పాండర్స్, రెండు గగన్ పేలోడ్స్ ఉన్నాయి. 3,164 కిలోల జీశాట్-15 ప్రస్తుతం సేవలందిస్తున్న ఇన్శాట్-3డీ, 4-బీల స్థానంలో సేవలందిస్తుంది. డీటీహెచ్ బ్రాడ్ బ్యాండ్, టీవీ ప్రసారాలకు సంబంధించిన సేవలతో పాటు గగన్ పేలోడ్స్ ద్వారా జీపీఎస్ సేవలకు జీశాట్-15 తోడ్పడుతుంది. రూ.660 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది. నిఘా విమానం పీ-8ఐ జాతికి అంకితం నిఘా విమానం పీ-8ఐ విమానాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నవంబర్ 13న జాతికి అంకితం చేశారు. ఈ దీర్ఘశ్రేణి సముద్ర గస్తీ విమానం ప్రపంచంలోనే అత్యుత్తమ నిఘా విమానాల్లో ఒకటిగా పేరొందింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల పీ-8ఐ చే రికతో భారత వైమానిక దళబలం మరింత పెరిగింది. ఆర్థికం ఫార్చ్యూన్ టాప్-50లో సత్యనాదెళ్ల, అజయ్‌బంగా బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ రూపొందించిన ప్రపంచ టాప్ 50 బిజినెస్ లీడర్ల జాబితాలో భారత సంతతికి చెందిన అజయ్‌బంగా, ఫ్రాన్సిస్ డిసౌజా, సత్యనాదెళ్లలకు చోటు దక్కింది. ఈ జాబితాలో మాస్టర్డ్ కార్డ్అజయ్బంగా ఐదవ స్థానం, కాగ్నిజంట్ ఫ్రాన్సిస్ డిసౌజా 16వ స్థానం, మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ల 47వ స్థానాలలో నిలిచారు. ఈ జాబితాలో నైక్ కంపెనీకి చెందిన మైక్ పార్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఫేస్బుక్ మార్క్‌జుకర్ బర్గ నిలిచారు. సరైన దిశలో భారత్ సంస్కరణలు భారత్‌లో ఆర్థిక సంస్కరణలు సరైన దిశలో పయనిస్తున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వడానికి తమ వంతు సహకారం అందిస్తామని ఐఎంఎఫ్ తెలిపింది. భారత వృద్ధిరేటును 2015లో 7.3 శాతంగా, 2016లో 7.5 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది.