డేటింగ్‌ చేసేందుకు నెల పసికందును.. | One Month Baby Beaten By Mother Who Left Him To Go On Date In Ukraine | Sakshi
Sakshi News home page

డేటింగ్‌ చేసేందుకు నెల పసికందును..

Oct 17 2019 7:52 PM | Updated on Oct 17 2019 7:56 PM

One Month Baby Beaten By Mother Who Left Him To Go On Date In Ukraine - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశువు

రివ్నే : అమ్మను మించిన దైవం లేదంటారు. అలాంటి అమ్మే చెయ్యకూడని పని చేసింది. మాతృత్వాన్ని మచ్చ తెచ్చేలా వ్యవహరించింది. ఓ వ్యక్తితో డేటింగ్‌ చేసేందుకు నెల రోజుల పసికందును దారుణంగా హింసించి గదిలో బందించింది. పేగు బందాన్ని మరచి శిశువు కంటిపై, ఒంటిపై పిడిగుద్దులు గుద్ది వెళ్లిపోయింది. ఈ దారుణ ఘటన ఉక్రెయిన్‌ దేశంలోని రివ్నే నగరంలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన 19 ఏళ్ల యువతికి టీనేజీలోనే వివాహం అయింది. నెల రోజుల క్రితం పడండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడితో కలిసి రివ్నేసిటీలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో నివాసం ఉటుంది. ఓ రోజు శిశువు బాగా ఏడవడం మొదలెట్టాడు. దాదాపు గంట అయినప్పటీకీ బాబు ఏడుపు ఆపలేదు. దీంతో పక్కగదిలోని ఓ మహిళ వెళ్లి చూడగా రూమ్‌కి తాళం వేసి ఉంది. అనుమానం వచ్చి హోటల్‌ సిబ్బంది సహాయంతో తలుపులు తీసి శిశువు దగ్గరకు వెళ్లారు. శిశువు శరీరంపై, కుడి కంటిపై తీవ్రగాయాలు కనిపించాయి. దీంతో అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయంత్రం ఇంటికి వచ్చిన శిశువు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె చెప్పిన సమాధానాలు విని పోలీసులు షాక్‌కు గురయ్యారు. తన కొడుకు ఏకధాటిగా ఏడవడంతో ఒత్తిడికి గురయ్యానని, మానసిన ప్రశాంతత కోసం ఓ వ్యక్తితో డేటింగ్‌కి వెళ్లాలని చెప్పింది. తన కుమారుడినిపై దాడి చేయలేదని చెపుకొచ్చింది. కాగా, స్థానికులు మాత్రం శిశువు శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని చెప్పారు. శిశువు ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై శిశువు తండ్రి(27) మాట్లాడేందుకు నిరాకరించాడని స్థానిక మీడియా పేర్కొంది. భార్య భర్తల విభేదాలు వచ్చాయని, శిశువును స్వీకరించేందుకు తండ్రి ఆసక్తి చూపడంలేదని స్థానిక మీడియా పేర్కొంది.  నిందితురాలికి 16వ ఏటనే వివాహం జరిగిందని, ఇప్పటికే మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడని పోలీసుల విచారణలో తేలడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement