breaking news
one month boy
-
డేటింగ్ చేసేందుకు నెల పసికందును..
రివ్నే : అమ్మను మించిన దైవం లేదంటారు. అలాంటి అమ్మే చెయ్యకూడని పని చేసింది. మాతృత్వాన్ని మచ్చ తెచ్చేలా వ్యవహరించింది. ఓ వ్యక్తితో డేటింగ్ చేసేందుకు నెల రోజుల పసికందును దారుణంగా హింసించి గదిలో బందించింది. పేగు బందాన్ని మరచి శిశువు కంటిపై, ఒంటిపై పిడిగుద్దులు గుద్ది వెళ్లిపోయింది. ఈ దారుణ ఘటన ఉక్రెయిన్ దేశంలోని రివ్నే నగరంలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన 19 ఏళ్ల యువతికి టీనేజీలోనే వివాహం అయింది. నెల రోజుల క్రితం పడండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడితో కలిసి రివ్నేసిటీలోని ఓ ప్రైవేట్ హోటల్లో నివాసం ఉటుంది. ఓ రోజు శిశువు బాగా ఏడవడం మొదలెట్టాడు. దాదాపు గంట అయినప్పటీకీ బాబు ఏడుపు ఆపలేదు. దీంతో పక్కగదిలోని ఓ మహిళ వెళ్లి చూడగా రూమ్‌కి తాళం వేసి ఉంది. అనుమానం వచ్చి హోటల్ సిబ్బంది సహాయంతో తలుపులు తీసి శిశువు దగ్గరకు వెళ్లారు. శిశువు శరీరంపై, కుడి కంటిపై తీవ్రగాయాలు కనిపించాయి. దీంతో అంబులెన్స్‌కు ఫోన్ చేసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయంత్రం ఇంటికి వచ్చిన శిశువు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె చెప్పిన సమాధానాలు విని పోలీసులు షాక్‌కు గురయ్యారు. తన కొడుకు ఏకధాటిగా ఏడవడంతో ఒత్తిడికి గురయ్యానని, మానసిన ప్రశాంతత కోసం ఓ వ్యక్తితో డేటింగ్‌కి వెళ్లాలని చెప్పింది. తన కుమారుడినిపై దాడి చేయలేదని చెపుకొచ్చింది. కాగా, స్థానికులు మాత్రం శిశువు శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని చెప్పారు. శిశువు ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై శిశువు తండ్రి(27) మాట్లాడేందుకు నిరాకరించాడని స్థానిక మీడియా పేర్కొంది. భార్య భర్తల విభేదాలు వచ్చాయని, శిశువును స్వీకరించేందుకు తండ్రి ఆసక్తి చూపడంలేదని స్థానిక మీడియా పేర్కొంది. నిందితురాలికి 16వ ఏటనే వివాహం జరిగిందని, ఇప్పటికే మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడని పోలీసుల విచారణలో తేలడం గమనార్హం. -
నా బిడ్డను చంపాలని చూస్తోంది
ధర్మవరం అర్బన్ : ముక్కు పచ్చలారని పసికందు (ఒకటిన్నర నెల రోజులు) ను తన తల్లి చంపాలని చూస్తోందని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లాలోని కొత్తపేటలో నివాసం ఉండే సుధాకర్, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె సుహాసినిని బుక్కరాయ సముద్రం మండలం పొడ్రాళ్లపల్లికి చెందిన రామకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. నెలన్నర వయస్సున్న కుమారుడిని తీసుకొని సుహాసిని, రామకృష్ణ దంపతులు పుట్టింటికి వచ్చారు. అయితే సుహాసిని తల్లి వెంకటలక్ష్మి బాబు చెవిలో పొడిచి గాయం చేసి చంపాలని ప్రయత్నించింది. పిల్లవాడు అరవడంతో వెంటనే తల్లి సుహాసిని వారించే ప్రయత్నం చేసింది. ఎందుకు ఇలా చేస్తున్నావని సుహాసిని తన తల్లిని ప్రశ్నించడంతో నీ కొడుకును చంపుతానంటోందని పోలీసుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గణేష్‌ను కోరింది. -
అనుమానాస్పద స్థితిలో పసికందు మృతి