నా బిడ్డను చంపాలని చూస్తోంది | women complaint on her mother in anantapur district | Sakshi
Sakshi News home page

నా బిడ్డను చంపాలని చూస్తోంది

May 27 2016 11:49 AM | Updated on Jul 30 2018 8:37 PM

ముక్కు పచ్చలారని పసికందు (ఒకటిన్నర నెల రోజులు) ను తన తల్లి చంపాలని చూస్తోందని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ధర్మవరం అర్బన్ : ముక్కు పచ్చలారని పసికందు (ఒకటిన్నర నెల రోజులు) ను తన తల్లి చంపాలని చూస్తోందని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అనంతపురం జిల్లాలోని కొత్తపేటలో నివాసం ఉండే సుధాకర్, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె సుహాసినిని బుక్కరాయ సముద్రం మండలం పొడ్రాళ్లపల్లికి చెందిన రామకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

నెలన్నర వయస్సున్న కుమారుడిని తీసుకొని సుహాసిని, రామకృష్ణ దంపతులు పుట్టింటికి వచ్చారు. అయితే సుహాసిని తల్లి వెంకటలక్ష్మి బాబు చెవిలో పొడిచి గాయం చేసి చంపాలని ప్రయత్నించింది. పిల్లవాడు అరవడంతో వెంటనే తల్లి సుహాసిని వారించే ప్రయత్నం చేసింది. ఎందుకు ఇలా చేస్తున్నావని సుహాసిని తన తల్లిని ప్రశ్నించడంతో నీ కొడుకును చంపుతానంటోందని పోలీసుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ గణేష్‌ను కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement