తలుపులు పగలగొట్టిన పోలీసులు షాక్..! | Sakshi
Sakshi News home page

తలుపులు పగలగొట్టిన పోలీసులు షాక్..!

Published Thu, Jun 30 2016 10:49 AM

తలుపులు పగలగొట్టిన పోలీసులు షాక్..! - Sakshi

ఆమ్స్టర్డ్యామ్: డచ్ పోలీసులకు ఇటీవల వింత అనుభవం ఎదురైంది. ఓ ఇంట్లో మహిళ ఉరేసుకుందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి మరీ ఆమెను కాపాడటానికి ప్రయత్నించారు. అయితే ఆ తరువాతే తెలిసింది వారికి అసలు విషయం.

తూర్పు ఆమ్స్టర్డ్యామ్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న కొందరు వ్యక్తులు ఓ ఫ్లాట్లో మహిళ ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. కిటికీలోంచి స్పష్టంగా వేలాడుతూ కనిపిస్తున్న ఆ మహిళ కొన్ని గంటలుగా అలా కదలకుండా ఉండటంతో.. వారు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సైతం ఇదే దృశ్యాన్ని చూసి మహిళ ఉరేసుకుందని భావించారు. కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ స్పందించకపోవటంతో చివరికి తలుపులు పగలగొట్టి.. ఇంట్లోకి ప్రవేశించారు.

ఆ మహిళను దగ్గరగా పరిక్షించి చూస్తేగానీ తెలియలేదు.. అది గాలితో నింపిన ఒట్టి బొమ్మ అని. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. ఈ అనుభవాన్నంతా మీడియాకు వెల్లడించిన పోలీసులు.. అది బొమ్మ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆమ్స్టర్డామ్లో సెక్స్ వర్క్కు చట్టబద్ధత ఉంది. అక్కడ సెక్స్ షాపుల్లో ఇలాంటి సెక్స్ టాయ్స్ విరివిగా లభిస్తాయి. అయితే బొమ్మకు ఎందుకు ఉరివేశారు అనే విషయం మాత్రం తెలియరాలేదు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement